Share News

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

ABN , Publish Date - Mar 09 , 2026 | 09:19 PM

శనివారం నాడు గ్రేప్‌వైన్‌లో నాట్స్ 2026-27 కార్యవర్గం స్థానిక ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో సంస్థ బోర్డు నూతన ఛైర్మన్‌ కంచర్ల నందకిషోర్ ప్రసంగించారు.

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
NATS

పదిహేడేళ్ల క్రితం (2009లో) ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీని(నాట్స్) బలోపేతంగా, శాఖలు విస్తరించుకుని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. సరికొత్తగా నాట్స్ తెలుగువారి సేవకు సిద్ధంగా ఉండేలా, తెలుగు భాష-సంస్కృతికి పట్టం కట్టేలా నూతనంగా తయారు చేసేందుకు తన హయాంలో కృషి చేస్తానని సంస్థ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవాసాంధ్రుడు కంచర్ల నందకిషోర్ అన్నారు. నందకిషోర్‌ది కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ రిమ్మనపూడి. శనివారం నాడు గ్రేప్‌వైన్‌లో నాట్స్ 2026-27 కార్యవర్గం స్థానిక ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎక్కడో మారుమూల గ్రామం నుండి అమెరికాకు వచ్చిన తనకు మూలాల విలువ తెలుసునని అన్నారు. తన విజయాల వెనుక కుటుంబం పాత్ర వెలకట్టలేనిదని వెల్లడించారు. 2013, 2019లలో డల్లాస్‌లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు జరుపుకున్నామని, తిరిగి 2027లో డల్లాస్ ఈ సంబరాలకు వేదికగా మారడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా సతీష్ రెడ్డి(ఆటా), అజయ్ రెడ్డి(టీపాడ్), మాధవి లోకిరెడ్డి(టాంటెక్స్), డా. తోటకూర ప్రసాద్(తానా), రవి గుళ్లపల్లి, పెమ్మసాని రవిలు కలిసి నందకిశోర్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. బావర్చి(ఫుడ్), పినాకిల్(గ్రానైట్), అక్రొన్స్(రియల్ ఎస్టేట్), కె.ఎన్.కె(ఇన్వెస్ట్‌మెంట్స్), నెక్సిలో(హెల్త్ కేర్) వంటి రంగాల్లో ఆయన విజయాలను కొనియాడారు. నాట్స్ కార్యక్రమాలకు తమ మద్దతును తెలిపారు.

NATS2.jpg


అమెరికా వ్యాప్తంగా ఉన్న నాట్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ ఇప్పటివరకు 28 రాష్ట్రాల్లో విభాగాలు ఉన్న నాట్స్‌ను త్వరలో 50 రాష్ట్రాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. సలహామండలి సభ్యుడు డా. కొత్తా శేఖరం మాట్లాడుతూ ఇండియా-అమెరికాలోని తెలుగువారికి సేవ చేయాలనే సదుద్దేశంతో మాదాల రవి, నాదెళ్ల రణకుమార్ తదితరులు నాట్స్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నాట్స్ అంటే కిందిస్థాయిలో చేసే ప్రయోజనకరమైన పనులను దేశవ్యాప్తంగా అమలు చేసే నాణ్యమైన సైన్యం కలిగిన సంస్థ అని కొనియాడారు. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేని ఏకైక సంస్థ నాట్స్ అని పేర్కొన్నారు.

ఫ్రిస్కో మేయర్ పదవికి పోటీలో ఉన్న మార్క్ హిల్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు ప్రవాస ప్రముఖులకు సేవా పురస్కారాలు అందజేశారు. శనివారం ఉదయం నిర్వహించిన బోర్డు సమావేశంలో పలు కమిటీలను ఏర్పాటు చేసి తదుపరి లక్ష్యాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం కిషోర్ గృహంలో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరనాథ్ బుంగతావుల, రాజ్ అల్లాడ, పాములపాటి మదన్, అన్నే విజయశేఖర్, రాజేష్ కండ్రు, సుధీర్ మిక్కిలినేని, గోవాడ అజయ్, యలమంచిలి బిందు, మురళీ మేడిచెర్ల, ప్రేమ్ కలిదిండి, విజయ్ కట్టా, భాను లంకా, ఆది గెల్లి, బర్రి కృష్ణకాంత్, తుమ్మలపెంట శ్రీనివాస్, అను కొత్తా, విజయ్ కొండా, శేషు మారంరెడ్డి, ధూళిపాళ్ల భానుప్రకాష్, కిషోర్ నారె, అమర్ అన్నే, మండువ సురేష్-సతీష్, వెన్నం మురళీ, సుబ్బు జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రాజలక్ష్మి చిలుకూరు, రాజేష్ అడుసుమిల్లి తదితరులు పాల్గొన్నారు.

NATS3.jpgNATS4.jpgNATS5.jpgNATS6.jpgNATS7.jpg


ఈ వార్తలూ చదవండి:

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం

Updated Date - Mar 09 , 2026 | 10:27 PM