మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:26 PM
మిషిగన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి బరిలోకి దిగారు.
మిషిగన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్థానిక భారతీయులు, కమ్యూనిటీ సభ్యులు, మద్దతుదారులు పాల్గొన్నారు. అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్న అశోక్, స్థానిక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ సెనేటర్ మైక్ వెబ్బర్, ఎమ్-జీఓపీ కోచైర్ సన్నీ రెడ్డి, ఓసీఆర్‌పీ ఛైర్మన్ పాట్రిక్ వాన్స్, స్టేట్ రిప్రజెంటేటివ్ టామ్ కున్, కౌన్సిల్ మెన్ మార్క్ గన్ పాల్గొన్నారు. ప్రవాస తెలుగు వారు ప్రమోద్ గోపాల్, ఆనంద్ సిన్హా, వెంకట్ మంతెన, రఘు శంకర్మంచి, జాన్ రేనాల్డ్స్, శ్రీధర్ ఐత, శ్రీనివాస్ చిట్టలూరి, చెంచు రెడ్డి కూడా హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడిన అశోక్.. ప్రజల అవసరాలు, 56వ డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం పనిచేయాలని తన లక్ష్యాన్ని వివరించారు. కుటుంబాలపై పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు అవసరమని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారం వంటి అంశాల వల్ల కుటుంబాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించే విధానాలపై పని చేయాలని వివరించారు. విద్యా రంగంలో పాఠశాలల భద్రతను మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు సరైన మద్దతు కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్‌లో రోడ్లు, రవాణా సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వార్తలూ చదవండి:
తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం
యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్