Share News

లండన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:53 PM

లండన్‌లో వినాయక చవితి వేడుకలను తెలుగువారు ఘనంగా నిర్వహించారు.

లండన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
Vinayaka Chaturthi Celebrations in London

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో వినాయక చవితి వేడుకలను తెలుగువారు ఘనంగా నిర్వహించారు. ఏ దేశమేగినా... తెలుగు తల్లిని.. వినాయక చవితిని మర్చిపోమని మరోసారి నిరూపించారు. భారతీయ సంస్కృతి, తెలుగు సంప్రదాయం, హిందూ ధర్మ ఔన్నత్యాన్ని చాటేలా లండన్‌లో గణేష్ ఉత్సవం అట్టహాసంగా జరిగింది. లండన్‌లోని సటన్, క్రోయ్‌డాన్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లండన్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

5.jpg


విగ్రహం పెట్టడం మొదలు నిమజ్జనం వరకూ శాస్త్రోక్తంగా..

ఈ సందర్భంగా వినాయక విగ్రహాన్ని పెట్టి వ్రతకల్పం ప్రకారం పూజలు నిర్వహించారు. స్థానికులు పూలు, పత్రి సమర్పించారు. పూజారి భక్తులతో పూజల్ని చేయించారు. అనంతరం విగ్రహాన్ని బాజా భజంత్రీలు, డప్పు వాద్యాల నడుమ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు వీక్షకులను ఆకట్టుకుంది. పిల్లలూ పెద్దలూ ఈ ఊరేగింపులో ఉత్సాహంగా డాన్సులు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

4.jpg


ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నాం..

లండన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసినట్టు కమిటీ సభ్యులు భాస్కర్ రావు అమ్మినేని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక భాగస్వామ్యంతో వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయన్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ చెరుకూరి, వెంకట్ కంఠేటి, మురళీ మైనేని, లండన్ ఉత్సవ కమిటీ నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.

6.jpg3.jpg2.jpg8.jpg7.jpg


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘం

Updated Date - Sep 21 , 2026 | 09:59 PM