Komati Jayaram: కోమటి జయరామ్‌కు పదవి.. బే ఏరియాలో సంబరాలు..
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:28 AM
సీనియర్ నాయకుడు కోమటి జయరాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. రెండవసారి ఆయన ఈ పదవి ద్వారా సేవలు అందించనున్నారు..
నాలుగు దశాబ్ధాలకు పైగా అమెరికాలోని ఎన్నారై కమ్యూనిటీకి చేదోడువాదోడుగా ఉంటూ, టీడీపీ ఎన్నారై విభాగాన్ని చిరకాలంగా సమర్ధవంతంగా నడిపిస్తున్న సీనియర్ నాయకుడు కోమటి జయరాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. రెండో సారి ఆయన ఈ పదవి ద్వారా సేవలు అందించనున్నారు.

కోమటి జయరాం, బే ఏరియాలో స్వాగత్ రెస్టారెంట్స్ గ్రూపు అధినేతగా, దిగ్గజ తెలుగు సంఘమైన తానా అధ్యక్షులుగా, బాటా, ఏఐఏ వంటి సంఘాల వ్యవస్థాపక నాయకుడిగా చిరపరిచితులు. జయరామ్ రాజకీయంగా టీడీపీతో సుదీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉన్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో ఎన్నారై విభాగాన్ని అత్యంత పటిష్టంగా, క్రియాశీలంగా తయారుచేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం.

శంకర్ నేత్రాలయ వంటి పలు సంస్థలకు, దేవాలయాలకు, ఇతర వైద్య సంస్థలకు ఆయన పెద్దమొత్తంలో విరాళాలను అందించారు. పేద విద్యార్థుల చదువుకు సహాయం చేశారు. బే ఏరియాలో ఎవరికి ఏ ఆపదవచ్చినా సహాయం అందించేందుకు ముందుండే వ్యక్తిగా జయరామ్ కోమటిని పేర్కొంటారు. బే ఏరియా ఎన్నారై టీడీపీ నాయకులు వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో సమావేశమై జయరామ్ కోమటికి పదవి లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత కేక్ కట్ చేయించారు. ఎన్నారై కమ్యూనిటీకి, రాష్ట్రానికి జయరాం కోమటి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ కృష్ణ గుమ్మడి, విజయ్ సాగర్ రెడ్డి జెట్టి, శ్రీనివాస్ వట్టికూటి, తిరుపతిరావు వలివేటి, రమేష్ మల్లారపు, శ్రీనివాస్ వల్లూరుపల్లి, రామ్ తోట, కృష్ణ మోహన్ మట్టపర్తి, జగదీష్ గింజుపల్లి, నరేంద్రరెడ్డి కోన, మహేంద్ర కూచిపూడి, రాంబాబు ఉప్పుటూరి, తిరుమలపుత్ర చంద్రశేఖర్, హరి సన్నిధి, రవికిరణ్ ఆలేటి, జాస్తి రజనికాంత్, శ్రీకాంత్ కూర్మన, లోకేష్ మార్పూరు, అనిల్ రెడ్డి, సందీప్ నక్క, సుధీర్ సి, సుధాకర్ కె, రాజశేఖర్ హెచ్, కిషోర్ తాడికొండ, మోహన్ మల్లంపాటి, రాజుగారు, డేవిడ్ బానోతు, కిరణ్ కూసుపూడి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..
2010లో నోకియా ఫోన్లు ఆర్డర్ పెడితే 2026లో డెలివరీ..