Share News

యూఎస్ఏలో తెలుగు ఎన్నారై అదృశ్యం! ఆచూకీ కోసం తానా ప్రయత్నాలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 09:11 PM

అలాస్కాలో అదృశ్యమైన ఎన్నారై హరి ఆచూకి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు చేస్తున్న అన్వేషణ వివరాలను తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి హరి తల్లితండ్రులకు, బంధువులకు వివరించారు.

యూఎస్ఏలో తెలుగు ఎన్నారై అదృశ్యం! ఆచూకీ కోసం తానా ప్రయత్నాలు
Karasani Hari missing - TANA search efforts

హ్యూస్టన్‌లో నివసిస్తున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి డిసెంబర్ 22న అలాస్కా పర్యటనకు వెళ్ళి అదృశ్యమైన సంగతి తెలిసిందే. హరి ఆచూకి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు చేస్తున్న అన్వేషణ వివరాలను తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి హరి తల్లితండ్రులకు, బంధువులకు వివరించారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, అంతర్జాతీయ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ ఉమా.ఆర్. కటికి సూచన మేరకు సంతమాగులూరులో నివసిస్తున్న హరి కుటుంబాన్ని ప్రసాద్ సోంపల్లి సందర్శించారు. హరి రెడ్డి తల్లిదండ్రులను, అతని సన్నిహితులను కలిశారు, తానా ప్రతి సంవత్సరం అనేక కేసులను పరిష్కరిస్తోందని తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయం చేస్తుంటుందని చెప్పారు. కానీ ఈ కేసు ప్రత్యేకమైనది కావడంతో తాము అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాస్కాలో ముఖ్యంగా అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయని తెలిపారు.

Tana.jpg


అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం సహాయంతో, ఏపీ ప్రభుత్వం అమెరికా, అలాస్కా ప్రభుత్వానికి ఈ అన్వేషణలో సహాయపడమని సిఫార్సు లేఖలను జారీ చేసిందని చెప్పారు. విదేశాల్లో నివసిస్తున్న తమవారి కోసం, తల్లితండ్రులు, విద్యార్థులు తమ ప్రియమైన వ్యక్తిని ట్రాక్ చేయడంలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపిల్ ప్రొడక్ట్ ఎయిర్ ట్యాగ్ స్పెషాలిటీ గురించి లోతుగా వివరించారు. హరి రెడ్డి కరసాని ఆచూకి లభించే వరకూ అలాస్కా ప్రభుత్వ కృషి ఆగదని చెప్పారు.

అమెరికాలో నివసిస్తున్న తమ ప్రియమైన వారి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడాలని సూచించారు. అదే విధంగా అమెరికాలో ఉండే వారు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ భారత్‌లోని తమ తల్లితండ్రులతో, బంధువులతో రోజూ మాట్లాడుతూనే ఉండాలని కోరారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ, అమెరికాలో ఉన్నవారు ఏదైనా సలహా కావాల్సిన వారు 1-855-687-8262, లేదా 855-OUR-TANA కు కాల్ చేయాలని సూచించారు.


ఇవీ చదవండి:

అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం

బడ్జెట్‌ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!

Updated Date - Feb 13 , 2026 | 09:23 PM