Share News

డల్లాస్‌లో ఘనంగా ‘వివాహ పరిచయ వేదిక’

ABN , Publish Date - Oct 26 , 2026 | 07:05 PM

కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ కొమ్మినేని నేతృత్వంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో నిర్వహించిన ‘వివాహ పరిచయ వేదిక–3’ కార్యక్రమం విజయవంతమైంది.

డల్లాస్‌లో ఘనంగా ‘వివాహ పరిచయ వేదిక’
Kakatiya Seva Samithi Vivaha Parichaya Vedika

  • 300 మందికి పైగా హాజరు

  • ప్రతి సంవత్సరం ఉచితంగా నిర్వహిస్తామని నిర్వాహకుల ప్రకటన

డల్లాస్: కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ కొమ్మినేని నేతృత్వంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో నిర్వహించిన ‘వివాహ పరిచయ వేదిక–3’ కార్యక్రమం విజయవంతమైంది. సుమారు 300 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులు, వారి తల్లిదండ్రులు పరస్పరం పరిచయాలు పెంపొందించుకునేందుకు చక్కని వేదికగా నిలిచింది.

ఫ్రిస్కోలోని హిల్టన్ గార్డెన్ ఇన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబాల మధ్య పరిచయాలు, పరస్పర అవగాహన పెంపొందించడం ద్వారా వివాహ సంబంధాల అన్వేషణను సులభతరం చేయడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

8.jpg


కార్యక్రమానికి వీణ యలమంచిలి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రిజిస్ట్రేషన్ బాధ్యతలను సువర్ణ, సుధ, అరుణ, పల్లవి నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు. వధూవరులు, వారి తల్లిదండ్రుల మధ్య పరిచయాలు సజావుగా సాగేందుకు ప్రతిమ కొల్లి, లక్ష్మి కోటపాటి, శిరీష గడిపూడి, రేవతి ముమ్మనేని సహకరించారు.

కార్యక్రమ నిర్వహణలో అమ్మిరాజు ములకల, శ్రీనివాస్ కొమ్మినేని, రవి చిట్టూరి, సురేష్, జగదీష్, వెంకట్, ప్రసాద్, ఉదయ్, రవికిరణ్, గిరి, రామ్, రామకృష్ణ, సత్య, లక్ష్మణ్, అనంత్, అశోక్, శివరావమ్మ, శ్వేత, బాల, శరత్, నాగేష్ కీలక పాత్ర పోషించారు.

7.jpg


ఈ సందర్భంగా కొమ్మినేని మాట్లాడుతూ, ఒకే వేదికపై వధూవరులు, వారి తల్లిదండ్రులు పరస్పరం పరిచయం చేసుకోవడం వల్ల వివాహ సంబంధాల అన్వేషణ మరింత సులభతరమవుతుందని తెలిపారు. కమ్మవారి వివాహ పరిచయాల కోసం ఏడాది పొడవునా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు https://kakatiyasevasamithi.org/kakatiyamatrimony/ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.

అమ్మిరాజు మాట్లాడుతూ, ‘వివాహ పరిచయ వేదిక’ కార్యక్రమాన్ని వరుసగా మూడో సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఇకముందు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఉచితంగానే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమ విజయానికి సహకరించిన వధూవరులు, వారి తల్లిదండ్రులు, అతిథులు, ఈవెంట్‌ స్విఫ్ట్, మేఘమాల డెకార్స్, కాకతీయ వారియర్స్ సభ్యులకు కాకతీయ సేవా సమితి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

6.jpg5.jpg3.jpg2.jpg1.jpg


ఈ వార్తలనూ చదవండి:

ఫ్రిస్కోలో జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి రచనల ఆవిష్కరణ

దద్దరిల్లిన దమ్మాం దసరా వేడుకలు

Updated Date - Oct 26 , 2026 | 07:25 PM