Share News

కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య.. దశాబ్దకాల కనిష్ఠం దిశగా..

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:28 PM

కెనడాలో స్టడీ పర్మి్ట్లు ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది.

కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య.. దశాబ్దకాల కనిష్ఠం దిశగా..
Drop in Indian students in Canada

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఈ సంఖ్య బాగా పడిపోయింది. చివరి త్రైమాసికంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే గత దశాబ్దకాలంలో ఎన్నడూ చూడని కనిష్ఠాన్ని తాకుతుందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. వలసలపై కెనడా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న విషయం తెలిసిందే.


రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికం నాటికి కెనడాలో స్టడీ పర్మిట్ ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 51,900. చివరి త్రైమాసికంలోనూ ఇదే ఒరవడి కొనసాగితే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ దశాబ్దంలో ఎన్నడూ చూడని అత్యల్ప స్థాయికి పడిపోతుంది. కెనడాలో స్టడీ పర్మిట్‌లు ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2023లో 2,77,135గా ఉంది. 2024కు వీరి సంఖ్య 1,88,465కి, 2025లో 94,025కి పడిపోయింది.


వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వీసా జారీకి సంబంధించిన కఠిన ఆర్థిక నిబంధనలు, ఫేక్ అప్లికేషన్ల ఏరివేత ఫలితంగా భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయుల్లోనూ కెనడాపై ఆసక్తి తగ్గుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

తానా ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్‌లో థ్యాంక్స్‌గివింగ్ వేడుకలు.. వందలాది కుటుంబాలకు సాయం

కెనడాలో కాల్పులు.. భారత సంతతి యువ జంట మృతి

Updated Date - Nov 22 , 2026 | 09:28 PM