కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య
ABN , Publish Date - Feb 09 , 2026 | 09:51 PM
కెనడాలో తాజాగా దారుణం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో ఓ భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటకకు చెందిన చందన్‌కుమార్ అనే వ్యక్తి కాల్పులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టొరొంటోలో శనివారం ఈ ఘటన జరిగింది.
రెక్స్‌డేల్ బోలీవార్డ్‌లో వుడ్‌బైన్ షాపింగ్ సెంటర్ పార్కింగ్ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 3.31 గంటలకు కాల్పుల కలకలం రేగడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు చందన్‌కుమార్ రక్తపుమడుగులో కనిపించారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
చందన్ కుమార్ బ్రాంప్టన్ ప్రాంతంలో నివసించేవారని పోలీసులు తెలిపారు. ఆయన కారు వద్దనే కాల్పులకు గురయ్యారని తెలిపారు. పలు రౌండ్‌ల కాల్పులు జరిగాయని చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. అయితే, నిందితుల వివరాలను మాత్రం ఇంకా విడుదల చేయాల్సి ఉంది. చందన్ కుమార్ గత ఆరేళ్లుగా కెనడాలో పని చేస్తున్నారు. ఆయన తండ్రి టీచర్‌గా చేసి పదవీ విరమణ పొందారు. తనయుడి మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత్‌కు తిరిగొచ్చేయాలని ఎంత చెప్పినా తమ మాట వినలేదని కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చదవండి:
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!