Share News

ఇతడు చాలా డేంజరస్.. భారత సంతతి వ్యక్తికి యూకేలో 30 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:14 PM

యూకేలో మైనర్ బాలికలను వేధింపులకు గురిచేసిన భారత సంతతి వ్యక్తి కాజీ బిలాల్‌కు స్థానిక కోర్టు తాజాగా 30 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.

ఇతడు చాలా డేంజరస్.. భారత సంతతి వ్యక్తికి యూకేలో 30 ఏళ్ల జైలు శిక్ష
Bilal Kazi jailed for 30 years

ఇంటర్నెట్ డెస్క్: యూకేలో మైనర్ బాలికలను వేధింపులకు గురిచేసిన భారత సంతతి వ్యక్తి కాజీ బిలాల్‌కు స్థానిక కోర్టు తాజాగా 30 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికలు తమ ఇంట్లోనే అభద్రతా భావంతో వణికిపోయేలా బ్లాక్‌మెయిల్ చేసిన నిందితుడు అత్యంత ప్రమాదకారి అని న్యాయమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2021 - 2025 మధ్య నిందితుడు ఏకంగా 70 మంది బాలికలను వేధించాడని పోలీసులు తెలిపారు. బాధితులు అందరూ 10 - 17 ఏళ్లలోపు వారేనని చెప్పారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బిలాల్ కాజీ ఆన్‌లైన్‌లో రీస్ అనే 17 ఏళ్ల శ్వేతజాతీయుడి పేరిట ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడని చెప్పారు. ఇందుకు శ్వేత జాతికి చెందిన ఓ గుర్తుతెలియని టీనేజర్ ఫొటో కూడా వినియోగించాడని అన్నారు. ఆ తరువాత టీనేజ్ బాలికలను ఆన్‌లైన్ ప్రేమ పేరిట మెల్లగా ఉచ్చులోకి దింపాడని చెప్పారు. వారిని మభ్య పెట్టి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు షేర్ చేసేలా చేశాడని తెలిపారు. ఆ తరువాత వాటి సాయంతోనే మైనర్లను బ్లాక్ చేస్తూ తను చెప్పినట్టల్లా చేయాలని వేధించేవాడని అన్నారు.


కొన్ని సార్లు బాధితుల అకౌంట్లను కూడా హ్యాక్ చేసి అసభ్యకర కంటెంట్‌ను పోస్టు చేసేవాడని చెప్పారు. అతడు మైనర్లను సీక్రెట్‌గా రికార్డు చేసిన విషయాన్ని కూడా కోర్టుకు తెలిపారు. తనతో బంధం తెంచుకుంటానన్న వారి ఫోటోలు నెట్టింట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడని అన్నారు. బిలాల్ కాజీ వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు 70 మంది బాలికలపై వేధింపులకు దిగినట్టు దర్యాప్తులో బయటపడింది.


ఓ వ్యక్తి ఇంత దారుణానికి ఎలా పాల్పడగలడో తనకు అర్థం కావటంలేదని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అత్యంత చాకచక్యంగా మైనర్లను లొంగదీసుకున్న నిందితుడు చాలా ప్రమాదకర వ్యక్తి అని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఖతర్‌లో కమ్మని వేడుకగా కాకతీయ వనభోజనాలు

తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు

Updated Date - Nov 14 , 2026 | 02:33 PM