Share News

బహ్రెయిన్‌లో ప్రముఖ నటుడు చిరంజీవి జన్మదినోత్సవం.. అభిమానుల రక్తదానం

ABN , Publish Date - Aug 23 , 2026 | 07:55 PM

ప్రఖ్యాత సినీనటుడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానలు బహ్రెయిన్‌లో రక్తదానం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

బహ్రెయిన్‌లో ప్రముఖ నటుడు చిరంజీవి జన్మదినోత్సవం.. అభిమానుల రక్తదానం
Chiranjeevi Birthday celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తం. రక్తదానం అనేది జీవితంలో చేయగలిగిన ఒక గొప్ప కార్యం. ప్రఖ్యాత సినీనటుడు చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానలు రక్తదానం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తెలుగు సినీ దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినోత్సవ సందర్భంగా బహ్రెయిన్‌లో మెగాస్టార్ అభిమానులు, వీర మహిళలతో సహా జనసేన కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటారు.


మనమాలోని యస్.యం.సిలో జరిగిన ఈ రక్తదాన కార్యక్రమంలో 100కు పైగా యూనిట్ల రక్తదానం చేశామని జనసేన నాయకులు శ్రీనివాసరావు, హేమంత్, నగేష్, సతీష్ కుమార్, భాస్కర్ రాయుడులు తెలిపారు. రక్తదాన శిబిరం అనంతరం కేక్ కట్ చేసి లాంఛనంగా తమ అభిమాన నటుడి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు.

ఓ మనిషి సాటి మనిషికి చేసే అమూల్యమైన సాయం రక్తదానమని ఈ సందర్భంగా జనసేన నాయకుడు హేమంత్ వ్యాఖ్యానించారు.


chiru birthday.jpg

ఈ వార్తలనూ చదవండి:

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

Updated Date - Aug 23 , 2026 | 08:07 PM