Share News

నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:45 PM

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు కట్టింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో పరిశోధన సహకారం, నూతన సాంకేతికతలో శిక్షణ వంటి వాటికి అవకాశాలు మెరుగుపడ్డాయి.

నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు
Basavatarakam Cancer Hospital

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు కట్టింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో పరిశోధన సహకారం, నూతన సాంకేతికతలో శిక్షణ, క్యాన్సర్ చికిత్సలో సంయుక్త ప్రాజెక్టులు, విద్యార్థుల పరస్పర మార్పిడి వంటి వాటికి మెరుగైన అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ మేరకు బసవతారకం సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా. టీ. సుబ్రహ్మణ్యేశ్వరరావు నెబ్రాస్కాలోని మెడికల్ సెంటర్‌ను సందర్శించి అక్కడి ఆంకాలజీ విభాగ అసోసియేట్ డీన్ డా. ఆరె చంద్రకాంత్ నేతృత్వంలోని బృందంతో చర్చలు జరిపి ఒప్పందాలపై సంతకాలు చేశారు.

5.jpg

సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రసంగిస్తూ ఆంకాలజీలో సంస్థల మధ్య పరస్పర సహకారం ప్రాధానమని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా యువ వైద్యులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. డా. చంద్రకాంత్ తన వైద్యవృత్తి ప్రారంభ దశలో సుబ్రహ్మణ్యేశ్వరరావుతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. బసవతారకం ఆసుపత్రితో తమ వైద్య కళాశాల అనుసంధానం ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్య అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

3.jpg


అనంతరం నెబ్రాస్కా తెలుగు సమితి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో నాలుగు వైద్య శిబిరాలను బసవతారకం ప్రారంభించాలని సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ అభ్యర్థించారు. తద్వారా క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. డా. మాధురి ఆరే, డా. ఫణి తేజ్ ఆడిదం, క్రాంతి, కీర్తి సుధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2.jpg4.jpg


ఈ వార్తలూ చదవండి:

దుబాయి తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ పోటీలు

వైభవంగా తానా మిడ్ అట్లాంటిక్ ఉగాది వేడుకలు

Updated Date - Apr 10 , 2026 | 03:55 PM