Share News

దుబాయి తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ పోటీలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 09:07 PM

దుబాయ్ తెలుగు అసోసియెషన్ ఆధ్వర్యంలో ఉమ్మాల్ ఖ్వెయిన్‌లో ఉత్సాహభరితంగా క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ క్రికెట్ పోటీల్లో దుబాయితో సహా వివిధ ఎమిరేట్ల నుంచి తెలుగు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.

దుబాయి తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ పోటీలు
UAE Telugu association cricket

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో ఉన్న పరిస్థితులను మసిబూసి మారేడుకాయగా చేసి సంచలనాలతో అదరగొడుతున్న భారతీయ టీవీ ఛానళ్ళ ప్రసారాలకు తోడు సోషల్ మీడియాలో అనధికారిక సమాచారం ముంచెత్తుతున్న వేళ ప్రవాసాంధ్రుల్లో ఉత్సహాం నింపేందుకు ఇటీవల యు.ఎ.ఇలో తెలుగు అసోసియెషన్ క్రికెట్ పోటీలను నిర్వహించారు.

ఉమ్మాల్ ఖ్వెయిన్‌లో ఉత్సాహభరితంగా జరిగిన ఈ క్రికెట్ పోటీల్లో దుబాయితో సహా వివిధ ఎమిరేట్ల నుంచి తెలుగు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారని తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉగ్గిన దినేష్ తెలిపారు. దుబాయి ప్రభుత్వ సంక్షేమ విభాగంలో భాగమైన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆథారిటీ (CDA) అధికారులు మసూద్ అల్ బలూషీ, అబ్దుల్లా అల్ మన్సూరి, అబ్దుల్లా సామెలు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు ప్రారంభమైన అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగిందని దినేష్ తెలిపారు. క్రీడాకారులకు టీషర్టులను పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ యు.ఎ.ఇలోని తెలుగు ప్రజానీకం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు.

2.jpg


దుబాయి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏకైక తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియేషన్ భారతీయ సంస్కృతి, కళలను ప్రోత్సహించడంతో పాటు క్రీడా పోటీలను కూడా నిర్వహిస్తోందని దినేష్ తెలిపారు.

యూనికార్న్ అనే సంస్థ సౌజన్యంతో దాని ఆవరణలో ఈ టోర్నమెంటును T10 ఫార్మాట్లో నిర్వహించారు. టోర్నమెంట్‌లో 24 జట్లు పాల్గొని ఐదు నాకౌట్ దశలలో 23 మ్యాచ్‌లు ఆడగా, ఒకే సమయములో 6 క్రీడా మైదానాలలో వివిధ పోటీలను నిర్వహించి తమ సత్తాను చాటుకున్నారు. ప్రతి నాకౌట్ దశలోని విజేతలు తదుపరి నాకౌట్ దశలో తలపడ్డారు. మొదటి నాకౌట్ దశలో 12 మ్యాచ్‌లు, రెండవ నాకౌట్ దశలో 6 మ్యాచ్‌లు, మూడవ నాకౌట్ దశలో 3 మ్యాచ్‌లు జరిగాయి. మూడవ దశలో అత్యధిక రన్ రేట్ సాధించిన ఆంధ్రా వారియర్స్ జట్టు ఫైనల్ దశకు నేరుగా అర్హత సాధించింది. మూడవ దశలో విజేతలుగా నిలిచిన మిగితా రెండు (DGA రాయల్స్ మరియు ) జట్లు నాలుగవ నాకౌట్ దశలో (ప్రీ ఫైనల్ మ్యాచ్) తలపడ్డాయి. వారిలో విజేతగా నిలిచిన జట్టు (DGA రాయల్స్)ఫైనల్ దశకు చేరుకుందని దినేష్ తెలిపారు.

టోర్నమెంట్ విజేతలుగా దుబాయి నుంచి వచ్చిన డీజీటీ రాయల్స్ జట్టు నిలిచింది. మొదటి రన్నరప్‌గా ఆంధ్రా వారియర్స్ జట్టు నిలిచింది. రెండవ రన్నరప్‌గా కిరాక్ తెలుగు బాయ్స్ జట్టు నిలిచింది.

3.jpg


టోర్నమెంట్‌లో నిర్వహించిన అన్ని మ్యాచ్‌ల ఆధారంగా అత్యుత్తమ క్రీడా ప్రతిభని ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి ట్రోఫీలతో సత్కరించారు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద ట్రోఫీని DGT రాయల్స్ జట్టు నుంచి అనిల్ దక్కించుకోగా మాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా, బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కూడా కిరాక్ తెలుగు బాయ్స్ జట్టు నుంచి జంగ్లీ దక్కించుకున్నారు. బెస్ట్ బౌలర్ ట్రోఫీని కిరాక్ తెలుగు బాయ్స్ జట్టు నుంచి రాజు యాదవ్ , బెస్ట్ ఫీల్డర్ ట్రోఫీని DGT రాయల్స్ జట్టు నుంచి రమాకాంత్ కైవసం చేసుకున్నారు. REITZ Middle East, Diamond Land Properties ఈ కార్యక్రమానికి అండగా నిలిచాయి. తెలుగు అసోసియేషన్ పక్షాన రాజీవ్ చింతకాయల, నెల్సన్ సమన్వయం చేశారు. తెలుగు అసోసియేషన్ నుంచి చైర్మన్ మసివుద్దీన్, వైస్ చైర్మన్ సుదర్శన్, కల్చరల్-కమ్యూనిటీ డైరెక్టర్ శ్రీధర్, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేద్కర్, లత ఉషా, తౌఫీక్, మోహన కృష్ణ తదితరులు సహకరించినట్లుగా దినేష్ తెలిపారు.

4.jpg5.jpg


ఈ వార్తలూ చదవండి:

వైభవంగా తానా మిడ్ అట్లాంటిక్ ఉగాది వేడుకలు

ఒమాన్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం

Updated Date - Apr 07 , 2026 | 03:16 PM