Share News

ఒమాన్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 04 , 2026 | 10:04 PM

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి తరహాలో ఒమాన్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ఒమాన్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం
Sri Rama Kalyanam Oman

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి తరహాలో ఒమాన్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ శుక్రవారం వేయి కిలోమీటర్ల దూరంలోని సలాల, సోహార్, ఇబ్రి ఎడారి ప్రాంతాల నుండి కూడా వందల సంఖ్యలో భక్తులు మస్కట్‌కు తరలి వచ్చి శ్రీ కృష్ణ మందిర ఆవరణలో జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. స్థానిక ప్రవాసీ, ప్రముఖ వేద పండితులు విజయకుమార్ ఆధ్వర్యంలో పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నులపండువగా కార్యక్రమం కొనసాగింది. భారత రాయబారి జీవీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.


యుద్ధ పరిస్థితుల్లో అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ ఒమానీ ప్రభుత్వం తమకు కల్యాణం నిర్వహించుకోవడానికి అనుమతించినందుకు కల్యాణోత్సవ ముఖ్య నిర్వాహకులలో ఒకరైన చందక రాందాస్ కృతజ్ఞతలు తెలిపారు.Kalyanam 2.jpgKalyanam.jpg


ఈ వార్తలూ చదవండి:

అమరావతికి చట్టబద్ధత.. బే ఏరియాలో ఎన్నారైల హర్షాతిరేకాలు

అమరావతికి చట్టబద్ధత.. ఎన్నారై నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో సంబరాలు

Updated Date - Apr 05 , 2026 | 03:19 PM