Share News

వైభవంగా తానా మిడ్ అట్లాంటిక్ ఉగాది వేడుకలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 10:14 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం వారు పరాభవ నామ సంవత్సరపు ఉగాది వేడుకలను పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్‌లో వైభవంగా నిర్వహించారు.

వైభవంగా తానా మిడ్ అట్లాంటిక్ ఉగాది వేడుకలు
TANA Mid Atlantic Ugadi celebrations USA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం వారు పరాభవ నామ సంవత్సరపు ఉగాది వేడుకలను పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్‌లో వైభవంగా నిర్వహించారు. తద్వారా తెలుగువారి వైభవాన్ని మరోసారి చాటిచెప్పారు. ఈ వేడుకలను తిలకించేందుకు దాదాపు 1,800 మందికిపైగా తెలుగువాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చారు.

తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, సతీష్ తుమ్మల మార్గదర్శకత్వంలో తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఈ ఉగాది వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.

ఈ ఉగాది వేడుకలు మధ్యాహ్నం 3.45 నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత ప్రార్థనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఉగాది పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు వచ్చినవారికి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.

స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఇండియన్ ఐడల్ స్టార్ అనిరుధ్ సుస్వరం సంగీత విభావరి అతిథులను ఆకట్టుకుంది. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కె.పి. సోంపల్లి ఈ వేడుకల్లో చేసిన పౌరాణిక ఏకపాత్రాభినయం అలరించింది.

4.jpg


ఈ వేడుకలకు ఎలైట్ స్పాన్సర్లుగా డాక్టర్ నాయుడు, డాక్టర్ ప్రమీల మోటుపల్లి, తిరుమల్ మునుకుంట్ల, సుబ్రహ్మణ్యం ఒసూరు, రామకృష్ణ తాడిసెట్టి, ప్రీమియర్, ప్లాటినం స్పాన్సర్లు, స్టాల్స్ నిర్వాహకులు, యూత్ వాలంటీర్లు, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొన్న తానా మిడ్ అట్లాంటిక్ గర్ల్స్ క్లబ్‌కు నిర్వాహకులు విశేష కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ వేడుకకు గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించి పండుగ శోభను పెంచిన తెలంగాణ స్పైసెస్ కిచెన్‌కు నిర్వాహకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్వేత కొమ్మోజి వ్యవహరించి తన వాక్చాతుర్యంతో, హుందాతనంతో వేడుకను ఆకట్టుకునేలా చేశారు.

ఈ సందర్భంగా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన కళాకారులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు, గౌరవనీయులైన అతిథులకు, కమ్యూనిటీ సభ్యులకు, పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

5.jpg


తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ నరెపాలేపు, న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వారిని తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఘనంగా సత్కరించింది.

ఈ ఉగాది కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ వారు ఏర్పాటు చేసిన చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలను అందజేశారు.

అంతేకాకుండా, ఉగాది వేడుకల స్ఫూర్తిని, అద్భుతమైన క్షణాలను అద్భుతంగా చిత్రీకరించిన అరవింద్ నాగిళ్ల, హిరాక్లిక్స్ ఫొటోగ్రఫీకి తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

6.jpg2.jpg


ఈ వార్తలూ చదవండి:

అట్లాంటాలో ‘తానా’ మరో కార్యక్రమం.. సీపీఆర్‌పై శిక్షణ

సొంత ఊరిలో స్మశానం నిర్మాణం.. ఎన్నారై దాతృత్వం

Updated Date - Apr 04 , 2026 | 10:23 PM