Share News

గల్ఫ్ పేదల క్యాన్సర్ చికిత్సకు సహకరించాలి.. ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎన్నారై విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:04 PM

గల్ఫ్ దేశాలలో పని చేస్తూ క్యాన్సర్ బారిన పడి స్వదేశానికి తిరిగి వచ్చే పేద ప్రవాసాంధ్ర కార్మికులకు వైద్య చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రవాసాంధ్ర ప్రముఖురాలు శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణను కోరారు.

గల్ఫ్ పేదల క్యాన్సర్ చికిత్సకు సహకరించాలి.. ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎన్నారై విజ్ఞప్తి
MLA Balakrishna

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో పని చేస్తూ క్యాన్సర్ బారిన పడి స్వదేశానికి తిరిగి వచ్చే పేద ప్రవాసాంధ్ర కార్మికులకు వైద్య చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రవాసాంధ్ర ప్రముఖురాలు జగదీశ్వరి చేతన నందమూరి బసవతారకం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణను కోరారు. తెలుగు సంఘం సాటా సెంట్రల్ నాయకురాలు జగదీశ్వరి చేతన హిందుపూరంలోని బాలకృష్ణను ఆదివారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

క్యాన్సర్ బారిన పడి పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉద్యోగాలు వదులుకొని స్వదేశానికి తిరిగి వచ్చే పేద కార్మికుల చికిత్సకు అవసరమైన డబ్బును సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. క్యాన్సర్ చికిత్స ప్రయత్నంలో కుటుంబాలు ఆర్థికంగా దివాలా తీస్తున్న విషయాన్ని చేతన వివరించారు.


పేద గల్ఫ్ కార్మికులకు ఈ విషయంలో ప్రత్యేక రాయితీ ఇవ్వాలని చేతన విజ్ఞప్తి చేశారు. సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో నివాసముండే చేతన సాటా సెంట్రల్ ప్రవాసాంధ్ర సంఘం ద్వారా వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు జనసేనలో కూడా క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మెల్‌బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం

Updated Date - Jul 13 , 2026 | 04:23 PM