మెల్‌బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం
ABN , Publish Date - Jul 12 , 2026 | 08:42 PM
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కో-ఆర్డినేటర్ల సమావేశం మెల్‌బోర్న్‌లో అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
మెల్‌బోర్న్: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కో-ఆర్డినేటర్ల సమావేశం మెల్‌బోర్న్‌లో అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లందరూ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పదవులు పొందిన ప్రతినిధులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. తమకు కో-ఆర్డినేటర్లుగా సేవలందించే బాధ్యతలు అప్పగించి, తగిన గుర్తింపు ఇచ్చినందుుకు వారందరూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఎన్‌ఆర్‌ఐల (NRI) తరఫున ఏ విధంగా పూర్తిస్థాయి మద్దతు అందించాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు క్రియాశీలక భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలను ప్రవాసాంధ్రుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లు అందరూ రాష్ట్ర ప్రగతికి తమ వంతు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ విజయవంతమైన కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌టీ రీజినల్ కో-ఆర్డినేటర్ లగడపాటి సుబ్బారావు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు నర్మదా జొన్నలగడ్డ, గోపి నంబళ్లతో పాటు కో-ఆర్డినేటర్లు సుమా తాటినేని, కిషోర్ బలుసు, బాల పసుపులేటి, ఇతర కో-ఆర్డినేటర్లు, ప్రవాసాంధ్ర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం
అమెరికాలో ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు