అమెరికాలో ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:00 PM
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో వర్జీనియాలో (యూఎస్ఏ) ఎన్నారైల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో వర్జీనియాలో (యూఎస్ఏ) ఎన్నారైల ఆత్మీయ సమావేశం జరిగింది. అనిల్ బోయినపల్లి సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, 19వ ఆటా మహాసభల సమన్వయకర్తలు రవి చల్లా, జీనత్ కుందూర్‌తో పాటు సంస్థ సభ్యులు, ఎర్రబెల్లి మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దయాకరరావు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లో 19వ ఆటా మహాసభలు జరగనున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:
సంస్కృతి బహ్రెయిన్ నూతన కార్యవర్గం ఎన్నిక