Share News

కువైత్‌లో వైభవంగా బాలకృష్ణ జన్మదినోత్సవం

ABN , Publish Date - Jun 14 , 2026 | 07:34 PM

కువైత్‌లోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కువైత్‌లో వైభవంగా బాలకృష్ణ జన్మదినోత్సవం
Nandamuri Balakrishna Birthday Celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు దేశవిదేశాలలో ఎందరో అభిమానులు ఉన్నారు. నటసింహంగా అభిమానులు పిలుచుకునే బాలకృష్ణ సినీ, జన్మదినోత్సవాలను గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా కువైత్‌లోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తి అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరి ప్రశంసించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. ప్రజా సేవలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించారు.


ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రవాసాంధ్ర తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించే మహానటుడు, ప్రజల అభిమానాన్ని సంపాదించిన నాయకుడు నందమూరి బాలకృష్ణ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు.

nandamuri 2.jpg

బాలకృష్ణ సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఆదర్శప్రాయంగా నిలిచారని మరో గౌరవ అతిథి జనసేన, కువైత్ అధ్యక్షుడు యెర్రంశెట్టి హరి రాయల్ అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు బాలరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసింహం బాలకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కువైత్‌లో అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడుతున్న ఒక వ్యక్తికి లోకేష్ యువసేన కువైత్ కమిటీ సభ్యులు రూ.25,000, మైనార్టీ నాయకులు గోహర్ అలీ రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ కువైత్ కోశాధికారి మోహన్ రాచూరి, అస్మా, పర్వానియా, హవాలి గవర్నరెట్ అధ్యక్షుడు ముస్తాక్ ఖాన్, రెడ్డయ్య చౌదరి, రవి మలిశెట్టి, ఎన్టీఆర్ సేవా సమితి ఉపాధ్యక్షుడు సీఆర్ రమేష్ నాయుడు, గుదే శంకర్, నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేష్, మైనార్టీ నాయకులు అర్షద్, తెలుగు యువత అధ్యక్షుడు మురళీ దుగ్గినేని, లోకేష్ యువసేన కువైత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన నాయకులు ప్రసాద్, మల్లికార్జున, శెట్టిపల్లి ప్రసాద్, మహిళ అధ్యక్షురాలు నారాయణమ్మ, దేవి చౌదరి, విజయ, సరోజ, శశి, అభిమానులు, ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కన్నయ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

దుబాయి వ్యాపారవేత్తకు తెలంగాణ ప్రభుత్వం తరఫున చొప్పదండి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

డెన్మార్క్‌లో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి

Updated Date - Jun 14 , 2026 | 07:46 PM