ఆటా మహాసభలు.. మేరీల్యాండ్ గవర్నర్‌కు ఆహ్వానం
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:18 PM
బాల్టిమోర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా మహాసభలకు మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్‌ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్‌ను కూడా సభలకు ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు ఆటా తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: జులై 31, ఆగష్టు 1,2 తేదీల్లో మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్‌ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జయంత్ గవర్నర్‌కు వివరించారు. 15వేల మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అనంతరం మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్‌ను కలిసి ఆమెను కూడా ఈ సభలకు ఆహ్వానించారు. ఇరువురు సానుకూలంగా స్పందించారని ఆటా ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో సభల కన్వీనర్ బానాల శ్రీధర్, ట్రస్టీలు మట్టపల్లి రామ్, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి