Share News

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై సమావేశం

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:54 PM

ఆటా మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశం ఎలికాట్ నగరంలో తాజాగా జరిగింది. సభ నిర్వహణకు సంబంధించి ప్రణాళిక, ఇతర అంశాలపై ఆటా సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు.

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై సమావేశం
ATA 19th Convention

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సభల ప్రణాళిక, ఏర్పాట్ల సమీక్ష కోసం ఎలికాట్ సిటీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీల ఏర్పాటు, సమన్వయ విధానాలపై చర్చించారు. డెలావేర్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా రాష్ట్రాల నుంచి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 70 కమిటీల బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు. సదస్సు నిర్వహణ సాఫీగా సాగేందుకు వివిధ బృందాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

కమిటీలకు సంబంధించిన చైర్లు, కో-చైర్లు, సభ్యుల పేర్లతో కూడిన ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, సభల కన్వీనర్ శ్రీధర్ బనాలా, ఇతర సభ్యులు శరత్ వేముల, రవి చల్లా, సుధీర్ డమిడి, జీనత్ కుందూర్, తిరుమల మునుకుట్ల, కౌశిక్ సమా, కిరణ్ ఆలా, శ్రీనివాస్ దర్గుల, సంతోష్ రెడ్డి, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


2.jpg3.jpg4.jpg


ఈ వార్తలూ చదవండి:

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

Updated Date - Mar 10 , 2026 | 04:35 PM