Share News

How To Overcome Winter Fatigue: చలి బద్ధకం వదలడం కోసం...

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:23 AM

చలికాలంలో బద్ధకం పెరుగుతుంది. దాంతో పూర్తిచేయవలసిన పనులన్నీ మూలన పడిపోతాయి. ఈ కాలంలో శరీరం, మనసూ రెండూ చలాకీగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి...

How To Overcome Winter Fatigue: చలి బద్ధకం వదలడం కోసం...

వింటర్‌ కేర్‌

చలికాలంలో బద్ధకం పెరుగుతుంది. దాంతో పూర్తిచేయవలసిన పనులన్నీ మూలన పడిపోతాయి. ఈ కాలంలో శరీరం, మనసూ రెండూ చలాకీగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

  • విటమిన్‌ డి: మెదడులోని హ్యాపీ హార్మోన్‌ సెరటోనిన్‌ మోతాదు తగ్గిపోకుండా ఉండాలంటే విటమిన్‌ డి సరిపడా ఉండాలి. కాబట్టి శరీరానికి ఎండ సోకేలా చూసుకోవాలి. ఎండ తగలకపోవడం వల్ల మెలటోనిన్‌ స్రావం పెరిగి, పగటి మత్తు పెరుగుతుంది.

  • వ్యాయామం: వ్యాయామం చేయడానికి బద్ధకిస్తే, దీర్ఘకాలంలో ఎముకలు, కీళ్లు బిగుసుకుపోయే పరిస్థితి తలెత్తుతుంది. శరీరంతో పాటు మనసు కూడా చురుగ్గా ఉండాలంటే ఈ కాలంలో తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కనీసం గంట పాటైనా నడక, ఈత, సైక్లింగ్‌ లాంటి వ్యాయమాలు చేయాలి.

  • కాలక్షేపాలు: చల్లని వాతావరణానికి భయపడి ఇంటికే పరిమితమైపోవడం సరి కాదు. బయటకు వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలి. కలిసి తిరగాలి. సరదాగా కాలక్షేపం చేయాలి. ఇలాంటి పనులతో హ్యాపీ హార్మోన్లు అయిన డోపమైన్‌, సెరటోనిన్‌, ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.

ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 13 , 2026 | 06:24 AM