నగుమోము కోసం
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:47 AM
మేకప్ సహజంగా, ఎక్కువసేపు ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి...
మేకప్ సహజంగా, ఎక్కువసేపు ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
ప్రైమర్ వాడకం: మేకప్‌కు ముందు ప్రైమర్ వాడటం వల్ల చర్మంపై ఉండే రంధ్రాలు కనబడకుండా ఉంటాయి. అంతేకాదు, మేకప్ రోజంతా తాజాగా ఉంటుంది.
సరైన ఫౌండేషన్ ఎంపిక: ఫౌండేషన్ రంగును ఎప్పుడూ దవడ ఎముక దగ్గర చెక్ చేయాలి. అది మీ చర్మం రంగులో కలిసిపోతే మీకు అది సరైన షేడ్ అనుకోవాలి.
బ్లెండింగ్ ముఖ్యం: బ్యూటీ బ్లెండర్ లేదా బ్రష్ వాడి మేకప్‌ను ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత నేచురల్ లుక్ వస్తుంది. లేదంటే ముఖం పగుళ్లు వచ్చినట్టు కనిపిస్తుంది.
కాన్సీలర్ ట్రిక్: కళ్ల కింద నలుపును కవర్ చేయడానికి కాన్సీలర్‌ను ‘వి’ షేప్‌లో అప్లై చేయాలి. దీనివల్ల ముఖం లిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది.
సెట్టింగ్ స్ర్పే: మేకప్ అంతా పూర్తయ్యాక సెట్టింగ్ స్ర్పే వాడటం మర్చిపోవద్దు. ఇది మేకప్ చెమట వల్ల కారిపోకుండా కాపాడుతుంది.
లిప్‌లైనర్: లిప్‌స్టిక్ వేసే ముందు అదే రంగు లిప్‌లైనర్‌తో అవుట్‌లైన్ గీస్తే లిప్‌స్టిక్ పెదవుల బయటకు రాకుండా నీట్‌గా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
For More AP News And Telugu News