స్ట్రాప్ డ్రస్... సూపర్
ABN , Publish Date - May 13 , 2026 | 04:23 AM
వేసవిలో దుస్తులు ఎంత తేలికగా ఉంటే అంత సౌకర్యం. అందుకోసం ఇవిగో ఇలాంటి స్ట్రాప్ డ్రస్సెస్ ఎంచుకోవచ్చు...
ఫ్యాషన్
వేసవిలో దుస్తులు ఎంత తేలికగా ఉంటే అంత సౌకర్యం. అందుకోసం ఇవిగో ఇలాంటి స్ట్రాప్ డ్రస్సెస్ ఎంచుకోవచ్చు.
ఈ కాలంలో ధారాళంగా గాలి చొరబడే దుస్తులకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. ఆ కోవకు చెందినవే స్ట్రాప్ డ్రసెస్. భుజాల మీద చిన్న పట్టీలను కలిగి ఉండే పొడవాటి గౌన్లు చూడడానికీ, ధరించడానికీ ఎంతో బాగుంటాయి. వీటిని ఎలాంటి సందర్భాల్లో వేసుకోవాలో, వీటికి ఎలాంటి యాక్సెసరీస్ జోడించాలో తెలుసుకుందాం!
ప్రింటెడ్ కాటన్, బగ్రు, కలంకారీ, జైపూర్ కాటన్‌లను స్ట్రాప్ డ్రస్ స్టిచింగ్ కోసం ఎంచుకోవచ్చు
డ్రస్ అంచుల్లో ఫ్రిల్స్ కుట్టిస్తే, డ్రస్‌కు రెట్టింపు లుక్ వస్తుంది
ఆకర్షణీయమైన లావుపాటి గుండీలతో డ్రస్‌కు మోడర్స్ లుక్ తెప్పించవచ్చు
కొల్హాపురి శాండిల్స్ లేదా ఫ్లాట్స్ ఈ డ్రస్సులకు చాలా బాగా నప్పుతాయి
చేతికి వాచ్, మెడలో సన్నని చైన్ ఈ దుస్తులకు చక్కగా మ్యాచ్ అవుతాయి
ఈ డ్రస్సులను డైలీ వేర్‌గా వాడుకోవచ్చు. ఈవినింగ్ షికార్ల కోసం, హాలీడే ఔటింగ్స్ కోసం కూడా ఎంచుకోవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత