Share News

మెదడు చురుకుగా ఇలా

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:31 AM

ఆలోచనా సామర్థ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే మెదడు చురుకుగా పనిచేయాలి. అందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే సరి...

మెదడు చురుకుగా ఇలా

ఆలోచనా సామర్థ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే మెదడు చురుకుగా పనిచేయాలి. అందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే సరి...

  • రోజూ ఉదయాన్నే యోగ, ధ్యానం, తేలికపాటి వ్యాయామం, వాకింగ్‌, జాగింగ్‌లలో ఒకదాన్ని అలవాటు చేసుకోవాలి. వీటివల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు చురుకుగా మారుతుంది.

  • శరీరంలో నీటిశాతం తగ్గితే డీహైడ్రేషన్‌ ఏర్పడి మెదడు పనితీరు మందగిస్తుంది. దీంతో మతిమరుపు, ఏ పనీ చేయాలనిపించకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగితే ఉత్సాహంగా అనిపిస్తుంది. మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

  • తరచూ ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మెదడు ఆలోచన సామర్థ్యం మెరుగుపడుతుంది.

  • తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, గింజలు, ధాన్యాలు, ఓట్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే మెదడుకు చురుకుదనం పెరుగుతుంది. బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరాలు తింటుంటే మెదడులోని కణాల వ్యవస్థ బలోపేతమవుతుంది. కాఫీ, టీలను ఎక్కువగా తాగితే మాత్రం వాటిలోని కెఫిన్‌.. మెదడును బలహీనపరచి జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. వీటికి బదలు గ్రీన్‌ టీ, హెర్బల్‌ పానీయాలు తాగడం మంచిది.

  • మొబైల్‌, టీవీలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు అలసిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు స్ర్కీన్‌ టైమ్‌ను నియంత్రించుకోవడం మంచిది.

  • పజిల్స్‌, బ్రెయిన్‌ గేమ్స్‌, సుడోకో, చెస్‌, క్రాస్‌ వర్డ్స్‌ లాంటివి మెదడుకు వ్యాయామాన్ని, శక్తిని అందిస్తాయి.

  • రోజూ కొత్త అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, నిరంతర సాధన అనేవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 22 , 2026 | 04:31 AM