పట్టు చీరల మన్నిక ఇలా...
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:57 AM
పట్టుచీరలు ఎప్పటికీ కొత్తవాటిలా మెరుస్తూ ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
పట్టుచీరలు ఎప్పటికీ కొత్తవాటిలా మెరుస్తూ ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
పట్టుచీరలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. కాటన్ లేదా మస్లిన్ సంచుల్లో భద్రపరచుకోవాలి.
పట్టుచీరల మధ్యలో కలరా ఉండలు లేదా కర్పూరం బిళ్లలను పెట్టకూడదు. వాటి వల్ల చీరల రంగులు మారవచ్చు. క్రిమి కీటకాలు చేరకుండా అయిదు లవంగాలు, ఆరు మిరియాలను చిన్న గుడ్డలో మూటలా కట్టి చీరల మధ్య పెట్టాలి. అలాగే సిలికాజెల్ ప్యాకెట్లను కూడా ఉంచితే తేమ చేరదు.
పట్టుచీరలపై నేరుగా పెర్ఫ్యూమ్‌ను స్ర్పే చేయకూడదు. పెర్ఫ్యూమ్‌లోని రసాయనాల వల్ల జరీ నల్లగా మారుతుంది.
వీటిని ఇంట్లో ఉతకకూడదు. రెండు లేదా మూడుసార్లు కట్టుకున్న తరువాత డ్రైక్లీనింగ్ చేయించడం మంచిది.
ఒకసారి కట్టుకున్న తరువాత చీరకు గాలి తగిలేలా ఆరేయాలి. తేమ లేదని నిర్ధారించుకున్న తరువాతే మడతపెట్టాలి.
మధ్యమధ్యలో పలుచని కాగితాలను పరుస్తూ పట్టుచీరలను మడతపెట్టాలి. కనీసం నాలుగు నెలలకోసారి చీరల మడతలను మారుస్తూ ఉండాలి. లేదంటే మడతలమీద దారాలు తెగిపోవచ్చు.
పట్టుచీరలపై పలుచని కాటన్ తువాలు లేదా దుపట్టా పరిచి మాత్రమే ఇస్త్రీ చేయాలి. ఐరన్‌బాక్స్‌ను సిల్క్ మోడ్‌లో పెట్టాలి.
పట్టుచీరలపై ఏవైనా మరకలు పడితే వాటిపై కొద్దిగా గ్లిజరిన్ లేదా టాల్కం పౌడర్ చల్లి దూదితో తుడిచేస్తే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..