Share News

Pancha Rinas In Hindu Tradition : ఆ ఋణాలు తీర్చుకుందాం

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:38 AM

మానవులుగా జన్మించినవారు తీర్చుకోవాల్సిన ఋణాలను పూర్వులు నిర్దేశించారు. అవి: దేవ, పితృ, మనుష్య, ఋషి, భూత ఋణాలు. వాటిని...

Pancha Rinas In Hindu Tradition : ఆ ఋణాలు తీర్చుకుందాం

మానవులుగా జన్మించినవారు తీర్చుకోవాల్సిన ఋణాలను పూర్వులు నిర్దేశించారు. అవి: దేవ, పితృ, మనుష్య, ఋషి, భూత ఋణాలు. వాటిని ‘పంచ ఋణాలు’ అంటారు. వీటన్నిటినుంచీ విముక్తి కలిగించేది సంక్రాంతి. సూర్యుడి ఆరాధనతో పాటు యజ్ఞ, యాగాదుల ద్వారా దేవ ఋణం; దానాలు, పిండప్రదానాల ద్వారా పితృ ఋణం; ఆ ఏడాదిలో తమకు లభించిన సంపద నుంచి పంచుకోవడం ద్వారా మనుష్య ఋణం; ధ్యాన సాధనలు, సత్సంగాల్లాంటి మంచి కార్యక్రమాల ద్వారా ఋషి ఋణం; పంచభూతాల సాక్షిగా భూమి, పశువులు, పక్షులకు సమర్పించేవాటి ద్వారా భూత ఋణం తీరుతాయంటారు పెద్దలు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే రోజు కాబట్టి దీన్ని ‘పెద్దల పండుగ’నీ, వ్యవహారికంగా ‘పెద్ద పండుగ’ అనీ అంటారు. తర్పణాలతో పాటు దానాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ప్రధానంగా కూష్మాండ (గుమ్మడిపండు) దానం చేస్తారు. సూర్యారాధన కూడా ఈ రోజున విశేషంగా చేస్తారు.

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 05:38 AM