Share News

నీడనిచ్చే ఏడు గుణాలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:21 AM

‘‘మానవుడు తన జీవితాన్ని ఏడు గుణాలతో అలంకరించుకోవాలి. అలాంటి వారికి అల్లాహ్‌ తన అనుగ్రహం అనే నీడను అందిస్తాడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ఈ లోకంలో...

నీడనిచ్చే ఏడు గుణాలు

సందేశం

‘‘మానవుడు తన జీవితాన్ని ఏడు గుణాలతో అలంకరించుకోవాలి. అలాంటి వారికి అల్లాహ్‌ తన అనుగ్రహం అనే నీడను అందిస్తాడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ఈ లోకంలో ఎండను తప్పించుకోవడానికి మనిషి నీడను వెతుక్కుంటాడు. కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు ప్రత్యేకమైన అల్లాహ్‌ నీడ తప్ప మరే నీడా ఉండదు. అప్పుడు ‘‘అల్లాహ్‌ కృపకు పాత్రులయ్యే ఏడు రకాల వ్యక్తులకు... తను తప్ప ఆశ్రయించేది ఏదీ లేని రోజున అల్లాహ్‌ తన నీడ ప్రసాదిస్తాడు’’ అని ఒక హదీసులో దైవప్రవక్త మహమ్మద్‌ తెలిపారు.

ఆ ఏడుగురిలో మొదటి రకం వ్యక్తి.. న్యాయబద్ధుడైన నాయకుడు. అధికారం వచ్చినా అహంకారానికి లోనుకాకుండా ప్రజలకు న్యాయం చేసేవాడు. రెండో వ్యక్తి... అల్లాహ్‌ ఆరాధనలో పెరిగిన యువకుడు. యవ్వనంలో తనలో ఉండే శక్తిని పాపకార్యాలకు కాకుండా నమాజ్‌ కోసం, అల్లాహ్‌ను విధేయంగా ఆరాధించడం కోసం, సత్కార్యాల కోసం వినియోగించేవాడు. మూడు... మసీదుతో హృదయాన్ని అనుసంధానించుకున్న వ్యక్తి. నాలుగు... స్వప్రయోజనం కోసం కాకుండా అల్లాహ్‌ కోసం తోటివారిని ప్రేమించే మనిషి. అయిదు... అల్లాహ్‌ను తలచుకొని పారవశ్యంలో మునిగి, ఒంటరిగా కన్నీరు పెట్టుకొనే వ్యక్తి. ఆరు... పాపం చెయ్యడానికి అవకాశం వచ్చినప్పుడు... ‘‘ఎవరూ చూడకపోయినా నా అల్లాహ్‌ చూస్తున్నాడు’’ అనే భావనతో ఆ పాపానికి దూరంగా ఉండేవాడు. ఏడు... అందరి ముందు ప్రదర్శన కోసం కాకుండా... అల్లాహ్‌ ప్రసన్నత కోసం మాత్రమే దానం చేసేవాడు.

ఈ హదీస్‌ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది. మనిషి చేసిన మంచిని తోటివారు, లోకం గుర్తించకపోయినా అల్లాహ్‌ తప్పకుండా చూస్తాడు. మన కన్నీళ్ళను, మన త్యాగాలను, గుప్తంగా చేసే దానాలను, పాపం నుంచి దూరంగా ఉండే సద్బుద్ధిని ఆయన గమనిస్తాడు. కాబట్టి ఆ ఏడు గుణాలతో మన జీవితాలను అలంకరించుకుందాం.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

మనిషి చేసిన మంచిని తోటివారు, లోకం గుర్తించకపోయినా అల్లాహ్‌ తప్పకుండా చూస్తాడు. మన కన్నీళ్ళను, మన త్యాగాలను, గుప్తంగా చేసే దానాలను, పాపం నుంచి దూరంగా ఉండే సద్బుద్ధిని ఆయన గమనిస్తాడు. కాబట్టి ఆ ఏడు గుణాలతో మన జీవితాలను అలంకరించుకుందాం.

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..

హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..

Updated Date - Oct 02 , 2026 | 04:21 AM