రెండో రోజూ లాభాలే..
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:23 AM
దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ మరింత ముందుకు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో...
898 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ మరింత ముందుకు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రెండ్ ఉన్నప్పటికీ మన మార్కెట్లు పరుగులు తీశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 897.96 పాయింట్లు (1.08 శాతం) పెరిగి 83,919.71 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ సూచీ 1,016.21 పాయింట్లు పెరిగి 84,037.96 స్థాయిని తాకింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 286.30 పాయింట్ల లాభంతో 25,800.60 వద్ద ముగిసింది. బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు, విదేశీ నిధుల ప్రవాహం ఇందుకు దోహదపడ్డాయి. ఈ నెలలో ఇప్పటి వరకు సెన్సెక్స్ 9,460.18 పాయింట్లు (12.70 శాతం), నిఫ్టీ 2,747.5 పాయింట్లు (11.91 శాతం) మేర లాభపడ్డాయి.
రూపాయి 70 పైసలు అప్: మన రూపాయి వరుసగా ఐదో రోజూ బలపడింది. శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 70 పైసలు పెరిగి రూ.92.62 వద్ద ముగిసింది. ఏడు నెలలకు పైగా కాలంలో రూపాయి రూ.93 దగ్గర ముగియడం ఇదే మొదటిసారి. విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ రూపాయికి దన్నుగా నిలుస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..