మోదీ తినమన్న పండు ఇదే
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:37 AM
ఇటీవల లద్దాఖ్‌లో జరిగిన ఓ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సీబక్‌థోర్న్ పండు గురించి ప్రస్తావించారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలతో నిండిన ఈ పండును...
ఇటీవల లద్దాఖ్‌లో జరిగిన ఓ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సీబక్‌థోర్న్ పండు గురించి ప్రస్తావించారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలతో నిండిన ఈ పండును యువత రోజూ ఆహారంలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు దానికి ‘సూపర్ ఫుడ్’ అంటూ కితాబిచ్చారు. దీంతో అందరూ ఈ పండు గురించి నెట్టింట్లో వెతకడం మొదలుపెట్టారు. అంతలా మోదీ మెచ్చిన ఈ పండు ప్రత్యేకతలను తెలుసుకుందాం రండి...
ఎలా ఉంటుందంటే...
ఫ ఇది బెర్రీ జాతికి చెందిన పండు. నారింజ రంగులో ఉంటుంది. పుల్లగా ఉంటూ కొద్దిపాటి ఉప్పదనపు రుచి దీని ప్రత్యేకత. లద్దాఖ్, హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. స్థానికంగా దీన్ని లేహ్ బెర్రీ, హిమాలయన్ బెర్రీ, చర్మా, అమెస్, ధూర్చుక్ అని పిలుస్తుంటారు. దీని మొక్క గుబురుగా ముళ్ల పొదలా పెరుగుతుంది. -40 నుంచి +40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలుగుతుంది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ప్రాచీన టిబెటన్ సాహిత్యంలో ఈ పండు ప్రస్తావన ఉంది. పూర్వ కాలంలో ఈ పండుతోపాటు మొక్క భాగాలను కూడా సంప్రదాయ వైద్యంలో వాడినట్లు తెలుస్తోంది.
పోషకాల గని...
ఫ సీబక్‌థోర్న్ పండులో సి విటమిన్.. నారింజలో కంటే పన్నెండు రెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాదు ఎ, బి, ఇ, కె విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, పాలీ ఫెనాల్స్, పలు మినరల్స్, 200కి పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియకు దోహదం చేసే ఫ్లేవనాయిడ్లు, టెర్పినాయిడ్లు, అమైనో ఆమ్లాలు కూడా అధికంగానే ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
ఫ సీబక్‌థోర్న్ పండును తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైనా వెంటనే తొలగిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ పండు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అల్సర్లు, మూత్రపిండాల్లో రాళ్లు, ట్యూమర్లను అడ్డుకుంటుంది. ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. నాడీ సమస్యలను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ముఖంపై మొటిమలు, తలలో చుండ్రు, ఇతర చర్మ వ్యాధులను మాయం చేస్తుంది.
అందుబాటులో ఇలా...
ఫ సీబక్‌థోర్న్ పండుతో తయారుచేసే హెర్బల్ పానీయం, జామ్, జ్యూస్, సలాడ్, స్మూతీలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటున్నాయి. డ్రై ఫ్రూట్ రూపంలోనూ దొరుకుతోంది. లద్దాఖ్‌లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎ్‌సఐఆర్).. ఈ పండ్ల సాగుని, వాటి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..