Share News

‘వద్దు’ అని చెప్పకుండానే..

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:52 AM

పిల్లలకు ఏదైనా పని చేయొద్దు అని చెప్పినప్పుడు వారిలో సహజంగానే ఒకరకమైన ప్రతిఘటన మొదలవుతుంది. ఆ మొండితనాన్ని...

‘వద్దు’ అని చెప్పకుండానే..

పిల్లలకు ఏదైనా పని చేయొద్దు అని చెప్పినప్పుడు వారిలో సహజంగానే ఒకరకమైన ప్రతిఘటన మొదలవుతుంది. ఆ మొండితనాన్ని తగ్గించడానికి ఈ మార్పులు చేయండి.

  • ప్రత్యామ్నాయం చూపండి: టీవీ చూడొద్దు అని ఆజ్ఞాపించేకంటే, ‘పద మనం కాసేపు బయట ఆడుకుందాం’ లేదా ‘ఈ బొమ్మ గీద్దాం రా’ అని వారిని మరో పనిలోకి మళ్లించండి.

  • కారణం వివరించండి: కేవలం ‘వద్దు’ అనకుండా, అది ఎందుకు వద్దో చిన్న ఉదాహరణతో చెప్పండి. ‘ఇప్పుడు ఐస్‌క్రీం తింటే గొంతునొప్పి వస్తుంది, అప్పుడు మనం పార్క్‌కు వెళ్లలేం కదా’ అని చెప్పి చూడండి.

  • ఎంపిక వారిదే అన్నట్టుగా: ‘నువ్వు ఇప్పుడు హోం వర్క్‌ చేస్తావా? లేక స్నానం చేశాక చేస్తావా?’ అని అడగండి. దీనివల్ల వారు స్వయంగా నిర్ణయం తీసుకున్నామన్న తృప్తితో పని పూర్తి చేస్తారు.

  • ఏం చేయాలో చెప్పండి: సాధారణంగా మనం ‘పరుగెత్తకు’ అని చెబుతాం. దానికి బదులుగా ‘నెమ్మదిగా నడువు’ అని చెప్పి చూడండి. ‘అరవద్దు’ అనే బదులు ‘కాస్త మెల్లగా మాట్లాడు’ అని చెప్పడం వల్ల వారికి ఏం చేయాలో స్పష్టమైన సూచన అందుతుంది.

  • వినే మనస్తత్వాన్ని పెంచండి: ఒక్కోసారి పిల్లలు మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు వారి వెనుక ఏదైనా అసహనం లేదా అలసట ఉండొచ్చు. ‘నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఎందుకు అలా చేస్తున్నావో చెబితే నేను నీకు సాయం చేస్తాను’ అని చెబుతూ వారి భావాలకు విలువ ఇవ్వండి. దీనివల్ల వారికి మీపై నమ్మకం పెరిగి, మీరు చెప్పినమాట వినడానికి ఇష్టపడతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 12:52 AM