Share News

విమోచక ప్రవక్త

ABN , Publish Date - May 15 , 2026 | 02:30 AM

మహారాజులైన బానిసల అద్భుత కథలు బైబిల్‌లో కొన్ని కనిపిస్తాయి. మోషే ప్రవక్త కథ కూడా అటువంటిదే. ఇశ్రాయేలు రక్షణ కోసం మొదట ఉదయించినవాడు మోషే...

విమోచక ప్రవక్త

దైవమార్గం

మహారాజులైన బానిసల అద్భుత కథలు బైబిల్‌లో కొన్ని కనిపిస్తాయి. మోషే ప్రవక్త కథ కూడా అటువంటిదే. ఇశ్రాయేలు రక్షణ కోసం మొదట ఉదయించినవాడు మోషే. బానిసల్లో పుట్టి... ఐగుప్తు (ఈజిప్టు) మహా సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. రాజై ఉండి కూడా... బానిస ముద్రతో మగ్గిపోతున్న తన జాతిని విడిపించి, స్వేచ్ఛ వైపు అతను నడిపించాడు.

ఐగుప్తు పాలకులైన ఫారో రాజులు పొరుగు రాజ్యాలపై దండెత్తి, అక్కడ ఉన్న జాతులను బంధించి, తమ రాజ్యానికి బానిసలుగా తీసుకువచ్చేవారు. వారితో ఎన్నెన్నో సేవలు చేయించుకొనేవారు. అలాంటి బానిసలైన ఆమ్రామ్‌, జాకోబెద్‌ దంపతులకు పుట్టినవాడే మోషే. తమ బిడ్డ తమలా బానిసగా బతుకకూడదన్న ఆలోచనతో... ఆ బిడ్డను భద్రంగా ఒక పెట్టెలో ఉంచి, ఆ రాజ్యంలో ప్రవహించే నైలు నదిలో వదిలేసింది తల్లి జాగోబిడ్‌. చెలికత్తెలతో కలిసి ఆ నదిలో జలకాలు ఆడడానికి వచ్చిన రాకుమార్తె బితియాకు తేజోవంతుడైన ఆ పసికందు కనిపించాడు. అతణ్ణి ఆమె ఎత్తుకొని, ముద్దాడి ‘మోషే’ అని పేరు పెట్టుకుంది. ‘నీటిలోంచి తీయగా బయటకు వచ్చినవాడు’ అని ఆ పేరుకు అర్థం. అయితే... ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడానికి అతని తల్లే నియమితురాలు కావడం విచిత్రం. అలా బానిస కొడుకైన మోషే... ఫరో రాజ మందిరంలో యువరాజై ఆడుకున్నాడు. మహా బలవంతులైన ఐగుప్తు ఫరో రాజుల చెర నుంచి తన స్వజాతీయులైన ఇశ్రాయిలీయుల్ని విడిపించాడు. వారిని స్వతంత్ర రాజ్యం వైపు నడిపించాడు. వారికి దేవుని స్వరం వినిపించాడు. కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరచి... దేవుని ఆజ్ఞానుసారం ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు. ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం దాటించిన గొప్ప విమోచకుడు మోషే. వారిని నలభయ్యేళ్ళపాటు కొండల్లో, కోనల్లో ప్రయాణింపజేసి, కానా భూములవైపు నడిపించిన మహా నాయకుడతను. ఆకలిదప్పులతో మలమలమాడుతున్న తన జాతీయుల కోసం కొండ నుంచి జలం ఉబికేలా చేశాడు. ఆకాశం నుంచి ఆహారం కురిసేలా చేశాడు. తన జాతి దేవుని మార్గంలో నడవడం కోసం... ఆ దేవుని నుంచే రాత ఫలకాల ద్వారా పది ఆజ్ఞలను స్వీకరించిన ప్రవక్త. అందుకే నాటి నుంచి నేటివరకూ అతను యూదులు, ఇస్రాయేలీయులు, క్రైస్తవుల గుండెల్లో నిలిచి గౌరవం అందుకుంటున్నాడు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌,

9866755024

ఈ వార్తలు కూడా చదవండి

వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్

చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

Updated Date - May 15 , 2026 | 02:30 AM