గ్లోబల్ గర్ల్
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:59 AM
భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ‘దేశీ గర్ల్’గా మొదలైన ఆమె ప్రయాణం హాలీవుడ్‌లోనూ...
భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ‘దేశీ గర్ల్’గా మొదలైన ఆమె ప్రయాణం హాలీవుడ్‌లోనూ సత్తా చాటి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగే వరకు సాగింది. గత ఆరేళ్లుగా ఆమె హిందీ సినిమాల్లో కనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే రాజమౌళి ‘వారణాసి’తో తిరిగి ఆమె ఇక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది.
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంతో ఆమె గ్రాండ్ రీఎంట్రీ ఇస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన ఆమె నటిస్తుండటం కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక అంతర్జాతీయస్థాయి ఈవెంట్‌గా మారిపోయింది. షూటింగ్ సెట్స్ నుంచి తాజా అప్‌డేట్స్ ఇస్తూ హాలీవుడ్ వర్క్ కల్చర్ నుంచి బాలీవుడ్ మసాలా వరకు తన పాత ఫ్రాంచైజీలైన ‘డాన్’, ‘క్రిష్’ల భవితవ్యం వరకు ప్రియాంక తాజాగా ముచ్చటించింది.
రాజమౌళి పిలుపు
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఇండియాలో సినిమా చేయడంపై ప్రియాంక స్పందిస్తూ.. ‘‘నిజానికి నేను ఇండియాలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ, సరైన కథ, అంతకంటే గొప్ప విజన్ ఉన్న దర్శకుడు దొరకాలి కదా! రాజమౌళి నాకు కాల్‌చేసి ‘వారణాసి’ గురించి చెప్పినప్పుడు నాకు వేరే ఆలోచన రాలేదు. ఒకవేళ నేను మళ్లీ ఇండియన్ సినిమాలో అడుగుపెట్టాలి అంటే.. ఇంతకంటే గొప్ప మార్గం మరోటి ఉండదని అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను’’ అని చెప్పుకొచ్చింది.
‘నా మెదడును రెండుగా విభజిస్తా’
హాలీవుడ్‌లో ‘సిటాడెల్’, ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ వంటి భారీ ప్రాజెక్టులు చేసిన తర్వాత ఇండియా పనిచేయడం ఎలా అనిపిస్తోందన్న ప్రశ్నకు.. ‘‘హాలీవుడ్‌లో పనితీరుకు, ఇండియాలో పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. అందుకే నేను మెదడును రెండు భాగాలుగా విభజించుకుంటాను. అక్కడి పాఠాలు ఇక్కడ, ఇక్కడి అనుభవాలు అక్కడ వాడను. ఎక్కడికక్కడ కొత్తగా వెళ్తాను. నటుడి ప్రయాణం ఎప్పుడూ దర్శకుడి విజన్ చుట్టూనే తిరుగుతుంది. రాజమౌళి సెట్‌లో ఎంత క్లారిటీతో ఉంటారో నాకు ముందే తెలుసు. అందుకే ఆయన ప్రపంచంలోకి నేను ఒక కొత్త విద్యార్థిలా వెళ్లాను’’ అని సమాధానమిచ్చింది.
రాజమౌళికి కండిషన్
ఈ సందర్భంగా ప్రియాంక ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. రాజమౌళికి ఆమె ఒక చిన్న రిక్వెస్ట్ చేసిందట. ‘‘నేను హాలీవుడ్‌లో యాక్షన్ చేశాను, డ్రామా చేశాను. కానీ పక్కా ఇండియన్ స్టైల్‌లో డ్యాన్స్ చేసి చాలా కాలమైంది. అందుకే ఈ సినిమాలో నాకు ఒక మంచి డ్యాన్స్ నంబర్ ఉండాలి అని అడిగాను. ఆయన కూడా నవ్వుతూ సరేనన్నారు. కానీ అది అంత కష్టంగా ఉంటుందని నేను ఊహించలేదు (నవ్వుతూ). ఆ సాంగ్ షూటింగ్‌లో నాతోపాటు మహేశ్‌బాబు కూడా చాలా కష్టపడ్డారు. మహేశ్ అయితే జోక్ చేస్తూ ‘నీ వల్లే నేను ఇన్ని స్టెప్పులు వేయాల్సి వస్తోంది’ అని ఆటపట్టించేవారు’’ అని గుర్తుచేసుకుంది.
‘డాన్ 3’.. ‘క్రిష్ 4’ ఉన్నాయా?
చాలా కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న.. ప్రియాంక ‘డాన్ 3’లో కానీ, ‘క్రిష్ 4’లో కానీ ఉంటుందా అని. దీని గురించి ప్రియాంక మాట్లాడుతూ ‘‘ప్రస్తుతానికి నేను వాటి గురించి ఏమీ మాట్లాడలేను’’ అని దాటవేసే ప్రయత్నం చేసింది.
‘వారణాసి’ విశేషాలు
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఒక ‘గ్లోబల్ ట్రాటర్ అడ్వెంచర్’. ఇందులో మహేశ్‌బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక ‘మందాకిని’గా అలరించబోతోంది.
మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. పురాణాలను, టైమ్ ట్రావెల్ కాన్సె్‌ప్టను మిక్స్ చేసి సుమారు రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
‘ది బ్లఫ్’
ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ ఈ నెల 25న నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇందులో ఆమె సముద్రపు దొంగ (పైరేట్)గా ఊహించని యాక్షన్ సీక్వెన్స్‌లలో కనిపించబోతోంది.
ఇవి కూడా చదవండి...
ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?
Read Latest Telangana News And Telugu News