Share News

పాపులర్‌ పెప్లమ్‌

ABN , Publish Date - May 27 , 2026 | 03:35 AM

వినూత్నమైన ఫ్యాషన్‌ పోకడ... ‘పెప్లమ్‌’. టాప్‌గా, బ్లౌజ్‌గా రెండు విధాలా ఉపయోగించుకోగలిగే ఈ ఫ్యాషన్‌ ట్రెండ్‌, తాజాగా మహిళల మనసులను దోచుకుంటోంది....

పాపులర్‌ పెప్లమ్‌

ఫ్యాషన్‌

వినూత్నమైన ఫ్యాషన్‌ పోకడ... ‘పెప్లమ్‌’. టాప్‌గా, బ్లౌజ్‌గా రెండు విధాలా ఉపయోగించుకోగలిగే ఈ ఫ్యాషన్‌ ట్రెండ్‌, తాజాగా మహిళల మనసులను దోచుకుంటోంది. ఈ లేటెస్ట్‌ పెప్లమ్‌ ట్రెండ్‌ మీద ఓ లుక్కేద్దామా...

‘పెప్లమ్‌’ అనే పేరు ప్రాచీన గ్రీకు పదం, పెప్లోస్‌ నుంచి వచ్చింది. పెప్లోస్‌ అంటే, కట్టుకునే వస్త్రం లేదా ట్యూబ్‌ను పోలిన ట్యూనిక్‌ అని అర్థం. అయితే 19వ శతాబ్దపు పాశ్చాత్య ఓవర్‌స్కర్ట్‌ల నుంచి 1940ల నాటి స్ట్రక్చర్డ్‌ జాకెట్లు, 1980ల నాటి పవర్‌సూట్స్‌ వరకూ కాలక్రమేణా వస్త్రాలంకరణ రూపాలు పలు మార్పులకు లోనయ్యాయి. అలా రూపాంతరం చెందిన పెప్లమ్‌ నేడు టాప్‌గా, జాకెట్‌గా మన భారతీయ వస్త్రధారణలో కూడా చోటు సంపాదించుకుంది.

అందమైన ఆకృతి కోసం...

ఛాతీని హత్కుకున్నట్టు బిగుతుగా ఉండి, దిగువన ఫ్లేర్స్‌ లేదా ప్లీట్స్‌ కలిగి ఉండే పెప్లమ్‌ రూపకల్పన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలున్నాయి. అవర్‌గ్లాస్‌ ఆకృతిని చేకూర్చడంతో పాటు, నడుము అందాన్ని రెట్టింపు చేయడమే పెప్లమ్‌ ప్రధమోద్దేశం! స్లీవ్‌లెస్‌, షార్ట్‌ స్లీవ్స్‌, లాంగ్‌ స్లీవ్స్‌.. ఇలా పలు వెరైటీల్లో దొరికే పెప్లమ్‌ బ్లౌజ్‌ లేదా టాప్స్‌ను సాధారణ వస్త్రధారణలో భాగంగా ధరించడంతో పాటు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ ప్రధానంగా కూడా ధరించవచ్చు.

ఇలా మ్యాచ్‌ చేయాలి

  • పెప్లమ్‌ టాప్‌ లేదా బ్లౌజ్‌కు అడుగున కుచ్చులుంటాయి కాబట్టి ఫిట్టెడ్‌ బాటమ్‌ను ఎంచుకోవాలి

  • కాటన్‌ పెప్లమ్‌ టాప్‌ను స్కీన్నీ జీన్స్‌ లేదా షార్ట్స్‌తో కలిపి ధరించవచ్చు

  • స్ట్రక్చర్డ్‌ పెప్లమ్‌ టాప్‌ను పెన్సిల్‌ స్కర్ట్‌ లేదా ట్రౌజర్స్‌తో మ్యాచ్‌ చేయొచ్చు

  • ఫ్లోయి పెప్లమ్‌ టాప్‌ను ఫాక్స్‌ లెదర్‌ ప్యాంట్‌తో లేదా స్లీక్‌ లెదర్‌ స్కర్ట్‌తో జత చేయొచ్చు.

ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం

చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా

Updated Date - May 27 , 2026 | 03:35 AM