Share News

పవర్‌ఫుల్‌ ప్యాచ్‌వర్క్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:08 AM

వినూత్నంగా, విభిన్నంగా కనిపించాలనుకుంటే సాదాసీదా చీరలకు బదులుగా ప్యాచ్‌వర్క్‌ చీరలను ఎంచుకోవాలి. రంగుల్లో, డిజైన్లలో వైవిధ్యంతో కళ్లను కట్టిపడేసే...

పవర్‌ఫుల్‌ ప్యాచ్‌వర్క్‌

ఫ్యాషన్‌

వినూత్నంగా, విభిన్నంగా కనిపించాలనుకుంటే సాదాసీదా చీరలకు బదులుగా ప్యాచ్‌వర్క్‌ చీరలను ఎంచుకోవాలి. రంగుల్లో, డిజైన్లలో వైవిధ్యంతో కళ్లను కట్టిపడేసే అలాంటి ప్యాచ్‌వర్క్‌ చీరల్లో ఇవి కొన్ని...

సుస్థిరమైన ఫ్యాషన్‌ ఫ్యూజన్‌, కళాత్మకతతో కూడిన చేతిపనితనానికి నిదర్శనాలే ప్యాచ్‌వర్క్‌ చీరలు. విభిన్నమైన వస్త్ర భాగాలను, రంగురంగుల అద్దకాలనూ, పలురకాల నేతలనూ ఒక చోటకు చేర్చి చీరగా మలిచే ఈ కళ సర్వత్రా ఆదరణ పొందుతోంది. కన్నులకు ఇంపుగా కూడా ఉండడంతో ప్యాచ్‌వర్క్‌ చీరలను మహిళలందరూ ఇష్టంగా ఎంచుకుంటున్నారు.

సంబల్‌పురి ఎథ్నిక్‌ వీవ్స్‌

సంప్రదాయ మగ్గాలను ఉపయోగించి రూపొందించిన ఒడిషా ప్యాచ్‌వర్క్‌ చీరలన్నీ జామెట్రిక్‌ ఆకృతులను కలిగి ఉంటాయి. అలాగే టెంపుల్‌ మోటిఫ్స్‌, స్థానిక కళాత్మకతను ప్రతిబింబిస్తూ ఉంటాయి.

లగ్జరీ, డిజైనర్‌ సిల్క్‌

ఈ కోవకు చెందిన ప్యాచ్‌వర్క్‌ చీరలు రివర్సిబుల్‌ డిజైన్లతో, ఎంబ్రాయిడరీ, సూక్ష్మ క్విల్టింగ్‌ పద్ధతుల్లో రూపొందుతూ పండుగలు, పెళ్లి వేడుకల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి.

సింగారం ఇలా...

  • కాటన్‌ ప్యాచ్‌వర్క్‌ చీరకు కలంకారీ బ్లౌజ్‌ చక్కగా సూటవుతుంది. టెర్రకోటా జ్యువెలరీ అలంకరించుకుంటే చీరకు కొత్త అందం సమకూరుతుంది

  • పట్టు ప్యాచ్‌వర్క్‌ చీరలకు సంప్రదాయ ఆభరణాలే అందాన్నిస్తాయి. కాబట్టి అలంకరణ కోసం టెంపుల్‌ జ్యువెలరీని ఎంచుకోవచ్చు.

  • సింథటిక్‌ ప్యాచ్‌వర్క్‌ చీరలకు ఫ్యాన్సీ నగలు బాగుంటాయి. మరీ ముఖ్యంగా పూసల ఆభరణాలు మరింత బాగా నప్పుతాయి.

ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 05:08 AM