ఫ్యాషన్ పవర్‌ఫుల్ పామ్ కఫ్
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:32 AM
చేతులకు గాజులు, వేళ్లకు ఉంగరాలు ధరిస్తున్నప్పుడు, అరచేతులకు ఆభరణాలను ఎందుకు పెట్టుకోకూడదు? ఈ ఆలోచనతో రూపొందినవే ‘పామ్ కఫ్స్’. ఈ తాజా ఫ్యాషన్...
చేతులకు గాజులు, వేళ్లకు ఉంగరాలు ధరిస్తున్నప్పుడు, అరచేతులకు ఆభరణాలను ఎందుకు పెట్టుకోకూడదు? ఈ ఆలోచనతో రూపొందినవే ‘పామ్ కఫ్స్’. ఈ తాజా ఫ్యాషన్ గురించిన ఇంకొన్ని విశేషాలు....
ముంజేతులకు ధరించే ప్రత్యేకమైన స్టేట్‌మెంట్ ఆభరణమిది. మణికట్టు లేదా వేళ్లకు బదులుగా అరచేతిని పట్టి ఉంచుతూ, అరచేతి వెనక భాగానికి ఆకర్షణను తెచ్చిపెట్టే అందమైన నగ... పామ్ కఫ్.
విభిన్నమైన డిజైన్లలో
మెటాలిక్ బ్యాండ్‌లా, సంకెలలా, కడియంలా అరచేతిని చుట్టి ఉంచేలా రూపొందే పామ్ కఫ్స్ వినూత్నమైన రూపాల్లో దొరుకుతూ ఉంటాయి. కఫ్ నుంచి కొనసాగే పొడవాటి చైన్లు వేళ్ల ఉంగరాలతో అనుసంధానమవుతూ ఉంటాయి. ఆకులు, లతలను పోలిన అల్లికలతో బంగారం, వెండి, ప్లాటినం లోహాలతో కూడా పామ్ కఫ్స్ రూపొందుతూ ఉంటాయి.
ఫోకల్ పాయింట్‌గా...
తరచూ కదిలే చేతుల మీద దృష్టి నిలవడమే ప్రధానోద్దేశంగా పామ్ కఫ్స్ రూపం పోసుకున్నాయి. తళుక్కున మెరిసే ఉంగరం, మడిచిన వేళ్లతో పాటు గుప్పిట్లోకి అదృశ్యమైపోతుంది. కానీ పామ్ కఫ్ అందుకు పూర్తి భిన్నం. వేళ్లు మడిచినా, అరచేతుల వెనక భాగం బహిర్గతమవుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఆభరణం అన్ని సమయాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుంది
భిన్నమైన బ్రాండ్లు...
పామ్ కఫ్, మర్యాదగా మణికట్టుకూ, వేళ్లకూ పరిమితమైపోయే ఆభరణం కాదు. ఇది మన అరచేతిని ఆప్యాయంగా హత్తుకునే అద్భుతమైన సోయగం. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ బ్రాండ్లు తమదైన శైలిలో పామ్ కఫ్స్‌ను రూపొందిస్తున్నాయి. ‘యెప్రెమ్’ అనే లెబనీస్ జ్యువెలరీ హౌస్, అత్యంత ఆసక్తికరమైన ‘ది క్లా’ అనే పామ్ కఫ్‌ను రూపొందించడంలో పేరు పొందింది. వజ్రాలు పొదిగిన ఈ టాలన్, నాజూకైన మహిళల చేతుల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. ప్యారి్‌సలోని హ్యూగో క్రీట్, పాప్ ఆర్ట్, ఎనామిల్ మిశ్రమ ఫ్లవర్ కఫ్స్‌ను రూపొందించింది. బార్సిలోనాలోని సౌట్ స్టూడియో, జెమ్‌స్టోన్స్ పొదిగిన పామ్ కఫ్స్‌ను రూపొందించింది. మన దేశంలో సుహాని పిట్టి, గోల్డ్ ప్లేటెడ్ ఆకులతో, తీగలతో అందమైన పామ్ కఫ్స్‌ను రూపొందించింది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News