పసందైన పలాజో సూట్స్
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:29 AM
ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లదే పై చేయి. ఈ కోవలోనే ముందు వరుసలో నిలుస్తూ మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి పలాజో సూట్స్. షార్ట్ కుర్తీ లేదా లాంగ్ కుర్తా,...
ఫ్యాషన్
ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లదే పై చేయి. ఈ కోవలోనే ముందు వరుసలో నిలుస్తూ మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి పలాజో సూట్స్. షార్ట్ కుర్తీ లేదా లాంగ్ కుర్తా, అందమైన దుపట్టా, నడుము నుంచి పాదాల వరకు వదులుగా ఉండే ప్యాంట్ (పలాజో).. ఈ డ్రెస్ ప్రత్యేకతలు.
ఇటాలియన్ భాషలో ‘పలాజో’ అంటే రాజభవనం అని అర్థం. అక్కడి ప్యాలె్‌సల కింది భాగాలు వెడల్పుగా విశాలంగా ఎలా ఉంటాయో అదే మాదిరి ఈ ప్యాంట్లు కూడా వదులుగా ఎక్కువ గేర్‌తో ఉండడం వల్ల వాటికాపేరు స్థిరపడింది. వీటిని ధరించినప్పుడు స్కర్ట్ తరహా లుక్ వస్తుంది. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో పలాజో ప్యాంట్లు... బీచ్ వేర్‌గా ఆపైన లౌంజ్ వేర్(నైట్ డ్రెస్)గా ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఈ వెస్ట్రన్ ప్యాంట్లకు సంప్రదాయ కుర్తీ/కుర్తాలను జతచేసి సరికొత్త ఇండో వెస్ట్రన్ పలాజో సూట్లను ఆవిష్కరించారు.
పలాజో సూట్లు వదులుగా ఉండడం వల్ల అవి కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే యువతులతోపాటు పలు రకాల పనులలో నిమగ్నమయ్యే గృహిణులకు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా చక్కగా నప్పుతాయి. ప్రయాణాల్లో ధరించడానికి అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. కాటన్, జార్జెట్, సిల్క్, చందేరీ, క్రేప్ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన పలాజో సూట్లను రోజువారీ ధరించవచ్చు. పండుగలు, పార్టీలప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్‌లు, జరీ లేదా జర్దోసీ వర్క్‌లు, చికన్‌కారీ వర్క్‌లు, లేస్ లేదా ప్యాచ్ వర్క్ చేసినవాటిని ఎంచుకుంటే బాగుంటుంది. అనార్కలీ స్టయిల్స్ అయితే గ్రాండ్‌గా కనిపిస్తాయి.
లైట్ కలర్స్‌తో సింపుల్ డిజైన్లు ఉన్నవాటిని ఉద్యోగినులు ధరిస్తే హుందాగా కనిపిస్తారు. సాదా పలాజోల మీద స్ట్రెయిట్ కట్ కుర్తీలు ఆఫీ్‌సవేర్‌గా బాగుంటాయి. మోకాళ్లను దాటే లాంగ్ కుర్తాలతో జతచేసుకుంటే ప్రొఫెషనల్ లుక్‌నిస్తాయి. మోడ్రన్ క్రాప్ టాప్స్, షార్ట్ కుర్తీలతో త్రీ పీసెస్ ఫ్రిల్స్ పలాజోలను ధరిస్తే ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన