Share News

అదరగొట్టే ఆర్గంజా

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:18 AM

అందమైన డిజైన్లతో పారదర్శకంగా కనిపించే ఆర్గంజా చీరలు పార్టీ వేర్‌గా, డైలీ వేర్‌గా ఆదరణ పొందుతూ ఉంటాయి. లేత రంగులతో ఆకట్టుకునే ఈ చీరలను ఎలా సింగారించాలో...

అదరగొట్టే ఆర్గంజా

ఫ్యాషన్‌

అందమైన డిజైన్లతో పారదర్శకంగా కనిపించే ఆర్గంజా చీరలు పార్టీ వేర్‌గా, డైలీ వేర్‌గా ఆదరణ పొందుతూ ఉంటాయి. లేత రంగులతో ఆకట్టుకునే ఈ చీరలను ఎలా సింగారించాలో తెలుసుకుందాం!

భిన్నమైన డిజైన్లలో..

ఆర్గంజా చీరలు అందమైన డిజైన్లు, ప్రింట్లలో రూపొందుతూ ఉంటాయి.

  • ప్రింటెడ్‌ ఆర్గంజా: పెద్ద ఆకారాల్లో ముదురు రంగు ఫ్లోరల్‌ డిజెన్లు, డిజిటల్‌ ప్రింట్లు కలిగి ఉండే ఆర్గంజా చీరలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ తరహా చీరలు వాటర్‌ పెయింటింగ్స్‌ను తలపిస్తూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

  • పలుచగా, తేలికగా, మెరుస్తూ ఉండే ఆర్గంజా చీరలు చిన్న పాటి వేడుకలు, సభలు, సమావేశాలకు హాజరయ్యే సందర్భాల్లో కట్టుకోడానికి ఎంతో అనువుగా ఉంటాయి. ప్యూర్‌ సిల్క్‌తో ఆధునిక వెర్షన్స్‌లో రూపొందుతున్న ఈ చీరలు సింథటిక్‌ ఫైబర్లు, నైలాన్‌ లేదా పాలియెస్టర్‌ పోగులతో తయారుతాయి. క్రిస్ప్‌గా, స్టిఫ్‌గా కనిపించే ఈ చీరలు ఎంతో తేలికగా, సౌకర్యంగా ఉంటాయి. బరువైన సంప్రదాయ పట్టుచీరలు, మెత్తని షిఫాన్స్‌లకు భిన్నంగా ఆర్గంజా చీరలు ఒంటికి అతుక్కుపోవు. బదులుగా శరీరానికి చక్కని ఆకృతిని అందిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

  • బనారసి ఆర్గంజా: తేలికగా ఉండే ఆర్గంజా చీరకు సంప్రదాయ బంగారు, వెండి జరీలను జోడించే విధానం వారణాసికే ప్రత్యేకం. ఈ చీరలు ఎంతో హూందాగా, అద్భుతంగా ఉంటాయి.

  • ఎంబ్రాయిడరీ అండ్‌ రఫుల్డ్‌: సంక్లిష్ట దారపు పనితనం, పూసల అలంకరణలు, రఫుల్డ్‌ అంచులను కలిగిన ఆర్గంజా చీరలు వేడుకలకు చక్కగా సూటవుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 12:18 AM