వన్ పీస్ డ్రస్ వండర్
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:31 AM
వానల్లో... సౌకర్యంగా ఉండే దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం! మరీ ముఖ్యంగా నేల మీద జీరాడుతూ తడిచే వీల్లేని దుస్తులను ఎంచుకుంటూ ఉంటాం. ‘వన్ పీస్ డ్రస్’ ఆ కోవకు...
ఫ్యాషన్
వానల్లో... సౌకర్యంగా ఉండే దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం! మరీ ముఖ్యంగా నేల మీద జీరాడుతూ తడిచే వీల్లేని దుస్తులను ఎంచుకుంటూ ఉంటాం. ‘వన్ పీస్ డ్రస్’ ఆ కోవకు చెందినదే! ఈ డ్రస్ ప్రత్యేకతలు, ధరించే విధానాల గురించి తెలుసుకుందాం!
చుడీదార్, జీన్స్, టాప్స్‌తో పోల్చితే వన్ పీస్ డ్రస్ ధరించడం ఎంతో సులభం. టాప్ బాటమ్ మ్యాచింగ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. పైగా చిటికెలో ధరించే వీలుంటుంది. కాబట్టి ప్రత్యేకించి వానలు కురిసే రోజుల్లో ఈ డ్రస్ మీదే ముచ్చట పడుతూ ఉంటారు అమ్మాయిలు. అయితే ఈ డ్రస్‌ను ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, నిమయాలు పాటించగలిగితే, డ్రస్ అందం మరింత ఇనుమడిస్తుంది.
లోదుస్తులు ఇలా...
వన్ పీస్ డ్రస్ పొడవు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మోకాళ్ల వరకూ లేదా అంతకంటే కొద్దిగా పైవరకూ ఉండే వన్ పీస్ డ్రస్‌ను ఇష్టపడేవారు, నెక్‌లైన్ ఆధారంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.
బ్రాసరీలు: ప్రతి రోజూ ధరించే ఎవ్రిడే ఫిటెడ్ స్టైల్ కోసం టీ షర్ట్ బ్రా ఎంచుకోవాలి. ఆఫ్ షోల్డర్ డ్రస్ కోసం స్ట్రాప్‌లెస్ బ్రా అలాగే, బ్యాక్‌లెస్ డిజైన్ డ్రస్ కోసం అడెసివ్ కప్స్‌ను ఎంచుకోవాలి.
ప్యాంటీస్: సీమ్‌లెస్, న్యూడ్ కలర్డ్ థాంగ్స్, బ్రీఫ్స్ లేదా బోయ్ షార్ట్స్ వేసుకోవచ్చు. న్యూడ్ కలర్స్ తెలుపు లేదా లేత రంగు డ్రస్సుల్లో కలిసిపోతాయి. కాబట్టి న్యూడ్ కలర్స్ ఎంచుకోవాలి.
స్లిప్స్: షీర్, లైట్ వెయిట్ లేదా క్లింగీ డ్రస్సుల అడుగున ఫుల్ కాటన్ లేదా సిల్క్ స్లిప్స్ ధరించాలి.
షార్ట్స్: వదులుగా లేదా పొట్టిగా ఉండే డ్రస్సుల కోసం సీమ్‌లెస్ షార్ట్‌లు లేదా కాటన్ బైక్ షార్ట్స్ ఎంచుకోవాలి. ఇలాంటి షార్ట్స్‌తో డ్రస్ గాలికి పైకి లేచినా కంగారుపడవలసిన అవసరం ఉండదు.
షేప్‌వేర్: హై వెయిస్టెడ్ షేపింగ్ షార్ట్స్ లేదా బాడీసూట్ ఎంచుకుంటే చూడచక్కని ఆకృతి సొంతమవుతుంది.
Also Read:
అక్టోబర్ 3న ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’: సీఎం చంద్రబాబు
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు