Share News

నేచురల్‌ డియోడరెంట్‌

ABN , Publish Date - May 04 , 2026 | 01:40 AM

చెమట వల్ల వచ్చే దుర్వాసన పదిమందిలో ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది. పెర్ఫ్యూమ్స్‌...

నేచురల్‌ డియోడరెంట్‌

చెమట వల్ల వచ్చే దుర్వాసన పదిమందిలో ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది. పెర్ఫ్యూమ్స్‌, డియోడరెంట్లతో కాకుండా వంటింట్లోని పదార్థాలతో ఆ వాసనను ఎలా పోగొట్టుకోవచ్చో చూద్దాం.

  • నిమ్మకాయ పిండిన నీటితో స్నానం చేయండి. నిమ్మలోని సిట్రిక్‌ యాసిడ్‌ చెమట వల్ల వచ్చే బ్యాక్టీరియాను చంపేస్తుంది. దీనివల్ల రోజంతా తాజాగా ఉంటుంది.

  • చెమట వాసనను పీల్చుకోవడంలో బేకింగ్‌ సోడాకు మించింది లేదు. కొంచెం బేకింగ్‌ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చంకల్లో రాసుకుని, ఆరిన తర్వాత కడిగేయండి. ఇది బ్యాక్టీరియాను చేరనివ్వదు.

  • వేసవిలో వచ్చే చెమటకాయలు, దురదలు తగ్గాలంటే వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇది సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది.

  • రాత్రి పడుకునే ముందు చందనం పొడిలో కొంచెం రోజ్‌వాటర్‌ కలిపి రాసుకుంటే శరీరానికి చలువ చేయడమే కాకుండా, మరుసటి రోజు కూడా శరీరం నుంచి మంచి సువాసన వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 04 , 2026 | 01:40 AM