మైక్రోవేవ్ జిడ్డు వదలట్లేదా!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:23 AM
మైక్రో ఓవెన్లో ఎక్కువగా జిడ్డు, మరకలు పేరుకుంటూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు సులువుగా శుభ్రం చేసే విధానాలివే...
మైక్రో ఓవెన్లో ఎక్కువగా జిడ్డు, మరకలు పేరుకుంటూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు సులువుగా శుభ్రం చేసే విధానాలివే...
వెడల్పాటి గిన్నెలో కప్పు నీటిని పోయాలి. అలాగే ఓ నిమ్మకాయను కోసి రసం పిండి తొక్కలను కూడా అందులోనే వేయాలి. ఆ గిన్నెను మైక్రోవేవ్‌లో పెట్టి పది నిముషాలు వేడిచేయాలి. నీళ్లు మరిగి ఆవిరి వస్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసి అయిదు నిముషాలు ఆగాలి. తరువాత గిన్నెను బయటికి తీసి తడి మైక్రో ఫైబర్ క్లాత్ లేదా స్పాంజ్‌తో మైక్రోవేవ్ లోపల, బయట నెమ్మదిగా తుడిచేయాలి. నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మైక్రోవేవ్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొడతాయి.
మైక్రోవేవ్‌లో ఒక్కోసారి ఆహారపదార్థాలు పడి లోపల అంటుకుని గట్టిపడుతుంటాయి. అలాంటప్పుడు బేకింగ్ సోడాలో తగినంత నీటిని చిలకరించి పేస్టులా చేసి వాటిపై చేత్తో రాయాలి. పది నిముషాల తరువాత తడి గుడ్డతో నెమ్మదిగా తుడిచేస్తే వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.
మైక్రోవేవ్ లోపల ఉండే టర్న్ టేబుల్‌ను లిక్విడ్ డిటర్జెంట్‌తో శుభ్రం చేసి గాలికి ఆరబెట్టాలి.
అరకప్పు నీటిలో అరకప్పు వెనిగర్‌ను వేసి కలపాలి. అందులో స్పాంజ్ లేదా దూదిని ముంచి దానితో మైక్రోవేవ్ బయటి భాగాలను, గ్లాస్‌డోర్‌ను సులువుగా శుభ్రం చేయవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్