Share News

ఇంపైన ఇయర్‌ కఫ్స్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:51 AM

మెడలో ధరించిన హారానికి తగిన మ్యాచింగ్‌ కమ్మలను ఎంచుకునే ఫ్యాషన్‌కు రోజులు చెల్లాయి. కమ్మల స్థానాన్ని ఆక్రమించిన ఇయర్‌ కఫ్స్‌ నేడు ప్రధాన ఆకర్షణగా మారిపోయాయి....

ఇంపైన ఇయర్‌ కఫ్స్‌

ఫ్యాషన్‌

మెడలో ధరించిన హారానికి తగిన మ్యాచింగ్‌ కమ్మలను ఎంచుకునే ఫ్యాషన్‌కు రోజులు చెల్లాయి. కమ్మల స్థానాన్ని ఆక్రమించిన ఇయర్‌ కఫ్స్‌ నేడు ప్రధాన ఆకర్షణగా మారిపోయాయి. ఈ ఇయర్‌ కఫ్స్‌ తాజా ట్రెండ్స్‌ మీద ఓ లుక్కేద్దాం!

ఇయర్‌ కఫ్స్‌లో ర్యాప్‌ అరౌండ్‌ బ్యాండ్స్‌తో పాటు చెయిన్‌ లింక్‌డ్‌ కఫ్స్‌, స్టేట్‌మెంట్‌ కఫ్స్‌, జుంకా కఫ్స్‌ ఇలా... పలు రకాల మోడల్స్‌ అందుబాటు లోకొచ్చాయి. ఈ వెరైటీ ఇయర్‌ కఫ్స్‌ను సందర్భోచితంగా ఎంచుకోవడంలో అసలు కిటుకు దాగి ఉంటుంది.

హెలిక్స్‌ క్రాలర్స్‌: వీటినే క్లైంబర్స్‌ అని కూడా అంటారు. ఒకే కమ్మతో మల్టిపుల్‌ పియర్సింగ్స్‌ను తలపించే ఈ ఇయర్‌ కఫ్స్‌ మోడర్స్‌ లుక్‌ తెచ్చి పెడతాయి. కాబట్టి ఈవినింగ్‌ పార్టీలు, పబ్స్‌ కోసం వీటిని ఎంచుకోవచ్చు

ర్యాప్‌ అరౌండ్‌: సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉండే ఈ ఇయర్‌ కఫ్స్‌ చెవి తమ్మెను చుట్టేసినట్టు ఉంటుంది. డైలీ వేర్‌గా, లగ్జరీ వేర్‌గా ఈ ఆభరణాన్ని ఎంచుకోవచ్చు

స్టేట్‌మెంట్‌ కఫ్స్‌:

ఈ కఫ్స్‌ సీతాకోకచిలుకలు, ఆకులు, పక్షుల రెక్కలు లాంటి సంక్లిష్టమైన ఆకారాల్లో రూపొందుతూ ఉంటాయి. ధరించే దుస్తుల ఫోకల్‌ పాయింట్‌గా ఉండేలా ఈ కఫ్స్‌ను రూపొందిస్తూ ఉంటారు

జుంకాలు, యాంటిక్‌ కఫ్స్‌: సంప్రదాయ భారతీయ ఆభరణాలు, సమకాలీన డిజైన్లను రంగరించి రూపొందించే ఈ ఇయర్‌ కఫ్స్‌ పెళ్లి, పుట్టిన రోజు వేడుకలకు తగినవి.

చైన్‌ లింక్‌డ్‌ కఫ్స్‌: సన్నగా, వేలాడే చెయిన్లతో కమ్మకు అనుసంధానమై ఉండే ఈ తరహా కఫ్స్‌ బొహిమియన్‌ లుక్‌ను తెచ్చిపెడతాయి.

అదే తరహా వస్త్రధారణకు ఈ కఫ్స్‌ చాలా బాగా సూటవుతాయి

ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 22 , 2026 | 01:51 AM