నేటి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:53 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో...
దేవీ నవరాత్రులు
నేటి అలంకారం
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఆశ్వయుజ శుద్ధ పంచమి, గురువారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి, శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలిస్తుందనీ, పంచ, దశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్నీ, ఉపాసకుల్నీ అనుగ్రహిస్తుందనీ భక్తులు నమ్ముతారు. లలితాదేవి విద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అనీ, మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనీ భక్తుల విశ్వాసం. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చెయ్యాలనీ, వివిధ పూలతో, కుంకుమతో అర్చించాలనీ పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారనీ, ఆమెను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయనీ స్పష్టం చేస్తున్నాయి.
నైవేద్యం: అల్లం గారెలు, ఐదురకాల తీపి పదార్థాలు
అలంకరించే చీర రంగు: బంగారు వర్ణం
అర్చించే పూల రంగు: వివిధ రకాలు
పారాయణ: చెయ్యాల్సింది: లలితా సహస్రనామం
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో