Share News

కోలం జ్యువెలరీ..!

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:27 AM

‘కోలం’ అంటే ముగ్గు అని అర్థం. ఇంటి ముందు వేసే రకరకాల చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గుల నమూనాలతో రూపొందించిన విభిన్నమైన నగలే ‘కోలం...

కోలం జ్యువెలరీ..!

‘కోలం’ అంటే ముగ్గు అని అర్థం. ఇంటి ముందు వేసే రకరకాల చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గుల నమూనాలతో రూపొందించిన విభిన్నమైన నగలే ‘కోలం జ్యువెలరీ’గా పేరుపొందాయి. అద్భుతమైన ఈ శైలితో అందుబాటులోకి వచ్చిన చోకర్లు, సింగిల్‌ పెండెంట్‌ చైన్లు, ఉంగరాలు, దుద్దులు, బ్రేస్‌లెట్లు, కడాలు తదితరాలన్నీ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చోళులు, పాండ్యుల కాలంలో ప్రాచుర్యం పొందిన టెంపుల్‌ జ్యువెలరీ తరహాలోనే ఈ కోలం జ్యువెలరీ కూడా రూపొందినట్లు చెబుతారు. పుల్లీలు, లైన్స్‌, లింక్‌లు, లింక్డ్‌ లూప్స్‌ వీటి ప్రత్యేకత. ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో తెలియని క్లిష్టమైన సిక్కు కోలం డిజైన్లకు విశేషమైన ఆదరణ ఉండేది.

పెద్ద ముగ్గును పెండెంట్‌లా మలిచి హస్లీ నెక్లె్‌సలో పొదిగి ధరించడం నేడు ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్‌. అదే ముగ్గుతో మ్యాచింగ్‌ స్టడ్స్‌ లేదా జుంకాలు, గాజులు, రింగ్స్‌ కూడా ఓ సెట్టులా లభ్యమవుతున్నాయి. మెలికలతో కూడిన చుక్కల ముగ్గులు, గుండ్రటి లేదా చతురస్రాకారపు ముగ్గుల డిజైన్లను యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పద్మం, నక్షత్రం, జ్యామితీ ఆకృతుల లాకెట్లను పొడవాటి గొలుసుకు జతచేసి మెడలో వేసుకుంటున్నారు. ఒకవైపు సంప్రదాయాన్ని మరోవైపు నూతనత్వాన్ని మేళవించిన ఈ ముగ్గుల నగలు బడ్జెట్‌ ధరల్లోనే లభించడం గమనార్హం.

వెండి, బంగారంతోపాటు వజ్రాలు జతచేసి కూర్చిన డిజైన్లు నగల షాపుల్లో సందడి చేస్తున్నాయి. స్టెర్లింగ్‌ సిల్వర్‌, బ్లాక్‌ మెటల్‌, ఇత్తడి, పంచలోహాలతో ఏడీ స్టోన్స్‌, సీజెడ్‌ స్టోన్స్‌ జోడించిన మోడల్స్‌ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌లలో విరివిగా లభ్యమవుతున్నాయి.


6-navya.jpg

పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలప్పుడు ధరించే కాంచీపురం పట్టుచీరలు, లంగా-ఓణీలు, లెహంగాలు, అనార్కలీలమీద ఈ కోలం నగలు రాయల్‌ లుక్‌నిస్తాయి. జానపద నృత్యాలతోపాటు భరతనాట్యం, కూచిపూడి లాంటి సంప్రదాయ నృత్యప్రదర్శనలకు ఇవి అనుకూలం. మినిమలిస్ట్‌ కోలం పెండెంట్లు, సింగిల్‌ మోటిఫ్‌ పెండెంట్లతో కూడిన సన్నని గొలుసులు వెస్ట్రన్‌ మ్యాక్సీ డ్రెస్‌లు, వి-నెక్‌ టాప్స్‌ మీద గ్రేస్‌గా కనిపిస్తాయి. కోలం స్టడ్స్‌/హూప్స్‌.. క్యాజువల్‌ ఆఫీ్‌సవేర్‌, కార్పొరేట్‌ డ్రెస్‌లు, జీన్స్‌-కుర్తీలపై ఎలిగెంట్‌ లుక్‌నిస్తాయి. ఆఫ్‌ షోల్డర్‌ గౌన్లు, బోట్‌నెక్‌ టాప్స్‌, బ్లేజర్‌ సూట్లపై సింపుల్‌ కోలం చోకర్లు/హస్లీలు బాగుంటాయి. ఇండో వెస్ట్రన్‌ ఫ్యూజన్‌ డ్రెస్‌లు, లాంగ్‌ స్కర్ట్‌లు, పాలాజో సెట్ల మీద ఆక్సిడైజ్డ్‌ కోలం పెండెంట్‌ సెట్లు స్టయిల్‌గా కనిపిస్తాయి.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 12:28 AM