Share News

ఏడు వలయాలు 56 రూపాలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:36 AM

సప్త మోక్షపురాల్లో ఒకటిగా, అత్యంత పురాతన నగరంగా ఖ్యాతిపొందిన వారణాసి. పరమ పవిత్రమైన కాశీ క్షేత్రాన్ని, విశ్వేశ్వరుడి ఆలయాన్ని ఎనిమిది దిక్కుల్లో, ఏడు వలయాల...

ఏడు వలయాలు 56 రూపాలు

ఆలయదర్శనం

సప్త మోక్షపురాల్లో ఒకటిగా, అత్యంత పురాతన నగరంగా ఖ్యాతిపొందిన వారణాసి. పరమ పవిత్రమైన కాశీ క్షేత్రాన్ని, విశ్వేశ్వరుడి ఆలయాన్ని ఎనిమిది దిక్కుల్లో, ఏడు వలయాల వ్యవస్థ ద్వారా వినాయకుడు రక్షిస్త్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సప్త వలయ వ్యవస్థలో 56 రూపాల్లో గణేశుడు దర్శనమిస్తాడు. వాటి మధ్యలో శ్రీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. కాశీ చుట్టూ పరిక్రమ (ప్రదక్షిణ) చేస్తూ... ఈ వినాయక ఆలయాలన్నిటినీ దర్శించుకోవడాన్ని ‘పంచక్రోశయాత్ర’ అంటారు. ఒక్కొక్క వలయంలో ఉన్న ఆ ఆలయాల గురించి తెలుసుకుందాం.

ఒకటో వలయంలో: అర్క వినాయకుడు, దుర్గా వినాయకుడు, భీమచండ వినాయకుడు, డేహ్లి వినాయకుడు, ఉద్దండ వినాయకుడు, పాశపాణి వినాయకుడు, ఖర్వ వినాయకుడు, శిద్ద వినాయకుడు. ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్రం వెలుపలి పరిక్రమలో ఉంటూ ఆ నగరాన్ని కాపాడతారు. భక్తులకు సిద్ధిని ప్రసాదిస్తారు.

రెండో వలయంలో: లంబోదర వినాయకుడు, కూట దంత వినాయకుడు, శాలకండ వినాయకుడు, కూష్మాండ వినాయకుడు, ముండ వినాయకుడు, వికట దంత వినాయకుడు, రాజ పుత్ర వినాయకుడు, ప్రణవ వినాయకుడు. ఈ అష్ట వినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తారు. వారికి రక్షణ కల్పిస్తారు.

మూడో వలయంలో: వక్రతుండ వినాయకుడు, ఏక దంత వినాయకుడు, త్రిముఖ వినాయకుడు, పంచాశ్వ వినాయకుడు, హేరంబ వినాయకుడు, విఘ్న రాజ వినాయకుడు, వరద వినాయకుడు, మోదకప్రియ వినాయకుడు. ఈ వలయంలోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు.

నాలుగో వలయంలో: అభయప్రద వినాయకుడు, సింహ తుండ వినాయకుడు, కూడితాక్ష వినాయకుడు, క్షిప్ర ప్రసాద వినాయకుడు, చింతామణి వినాయకుడు, దంత హస్త వినాయకుడు, శ్రీ పిఛిండల వినాయకుడు, ఉద్దండ ముండ వినాయకుడు.


అయిదో వలయంలో: స్ధూల దంత వినాయకుడు, కాళీ ప్రియ వినాయకుడు, చతుర్దంత వినాయకుడు, ద్విదంత వినాయకుడు, జ్యేష్ట వినాయకుడు, గజ వినాయకుడు, కాళ వినాయకుడు, నాగేశ వినాయకుడు.

ఆరో వలయంలో : మణికర్ణి వినాయకుడు, ఆశా వినాయకుడు, సృష్టి వినాయకుడు, యక్ష వినాయకుడు, గజ కర్ణ వినాయకుడు, చిత్రఘంట వినాయకుడు, మంగళ వినాయకుడు, మిత్ర వినాయకుడు. ఈ వలయంలోని వినాయకుల నామస్మరణతో ముక్తి లభిస్తుందనే విశ్వాసం ఉంది.

ఏడో వలయంలో: ఈ వలయంలోని అయిదుగురు వినాయకులు ప్రసిద్ధులు వారు: మోద వినాయకుడు, ప్రమోద వినాయకుడు, సుముఖ వినాయకుడు, దుర్ముఖ వినాయకుడు, గణనాథ వినాయకుడు.

అలాగే 54వ రూపమైన జ్ఞాన వినాయకుడు, 55వ రూపమైన ద్వార వినాయకుడు కాశీ నగరంలోని ముఖ్య ద్వారం మీద దర్శనమిస్తారు. 56వ రూపంలో అవిముక్త వినాయకుడిగా అవిముక్త క్షేత్రంలో గణపతి కొలువై ఉంటాడు.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 04:36 AM