Share News

నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశాలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:42 AM

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైనవే జవహర్‌ నవోదయ విద్యాలయాలు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 665 జవహర్‌ నవోదయ...

నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశాలు

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైనవే జవహర్‌ నవోదయ విద్యాలయాలు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 665 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో 15 చొప్పున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఉద్దేశించిన జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027కి నోటిపికేషన్‌ విడుదలైంది.

  • ఈ విద్యాలయంలో ప్రవేశానికి మొదటి అర్హత సదరు విద్యార్థి సంస్థ ఉన్న జిల్లాకు చెందినవారై ఉండాలి. 2026-27 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో అయిదో తరగతి చదువుతూ ఉండాలి.

  • సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. 3, 4, 5 తరగతులను గ్రామాల్లో చదివిన విద్యార్థులు ఈ కోటా కింద సీటు పొందగలరు. మూడో వంతు సీట్లను బాలికలు కేటాయిస్తారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లను పాటిస్తారు.

  • దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2015 మే 1 - 2017 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

  • నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. నవంబర్‌ 28న పరీక్ష జరుగుతుంది. సంబంధిత ప్రశ్న పత్రంలో మూడు విభాగాలు - మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, అర్థమెటిక్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఉంటాయి. వంద మార్కులకు ఆ మూడింటిలో కలిపి 80 ప్రశ్నలు ఇస్తారు. కాలవ్యవధి రెండు గంటలు. ఇంగ్లీష్‌, తెలుగుకు తోడు ఉభయ రాష్ట్రాల్లోని విద్యార్థులు హిందీ/ ఒరియా/ మరాఠీ/ ఉర్దూ/ కన్నడ మాధ్యమంలోనూ పరీక్ష పేపర్‌ ఇస్తారు.

  • నిర్దేశిత దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి జూలై 31లోగా ఆన్‌లైన్‌లో సమర్పించుకోవాలి.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:42 AM