Share News

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పక్కా వ్యూహంతోనే మంచి స్కోర్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:10 AM

జేఈఈ మెయిన్‌కు సంబంధించి మొదటి సెషన్‌ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. రెండో సెషన్‌ ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు జరగనుంది. అంటే ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తరవాత...

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పక్కా వ్యూహంతోనే మంచి స్కోర్‌

జేఈఈ మెయిన్‌కు సంబంధించి మొదటి సెషన్‌ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. రెండో సెషన్‌ ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు జరగనుంది. అంటే ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తరవాత రెండు వారాలకు మించి గడువు లేదు. మొదటి సెషన్‌ రాయని లేదంటే రాసినా మంచి స్కోర్‌ దక్కని విద్యార్థులకు ఇదే చివరి అవకాశం. ఇందులో వచ్చిన స్కోర్‌ ఆధారంగానే ఎన్‌ఐటీ సహా మరి కొన్ని సంస్థల్లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హతను కూడా తేలుస్తుంది. ఈ నేపథ్యంలో మంచి స్కోర్‌ సాధించేందుకు కొన్ని టిప్స్‌.

జనవరి సెషన్‌కు హాజరైన పక్షంలో నాటి మీ ప్రశ్నపత్రం - మీ ఫర్పార్మెన్ప్‌పై నిష్పాక్షిక, సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. పొరపాట్లను గుర్తించాలి. లోపం టైమ్‌ మేనేజ్‌మెంట్‌లోనా లేదంటే కాన్సెప్ట్‌ క్లారిటీ విషయమా అన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా కారణం కావచ్చు. ముందు ఆ పొరపాట్లను సరిచేసుకోవాలి.

  • మొదటి సెషన్‌లోని పది ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. ఈ ప్రక్రియ రోజువారీగా జరగాలి. అదే సమయంలో ఎక్కువ వెయిటేజ్‌ ఉన్న చాప్టర్లు, టాపిక్స్‌ను గుర్తించాలి. కాన్సెప్టులను మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి మాత్రమే రివైజ్‌ చేయాలి.

  • ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం అదీ కాదంటే రాత్రి కనీసం గంట సేపు ఫార్ములాలు, ముఖ్యమైన షార్ట్‌ నోట్స్‌ను రివైజ్‌ చేయాలి.

  • వేగం, కచ్చితత్వంపై దృష్టిపెట్టాలి. సులువైన ప్రశ్నలను ముందు చేసే విధంగా ప్రాక్టీస్‌ కొనసాగించాలి.

  • ముఖ్యమైన టాపిక్స్‌ అంటే ఫిజిక్స్‌లో కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మోడ్రన్‌ ఫిజిక్స్‌, రే ఆప్టిక్స్‌; కెమిస్ట్రీలో కో-ఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌, బయోమాలిక్యూల్స్‌, ప్రాక్టికల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్‌లో కాలిక్యులస్‌, వెక్టర్స్‌ అండ్‌ 3డిపై దృష్టి పెట్టాలి.

  • మొదటి ఏడాది టాపిక్స్‌ నుంచి ప్రిపరేషన్‌ను మొదలుపెట్టడం మంచిది. ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షల దృష్ట్యా ఇప్పటికే వాటి ప్రిపరేషన్‌ అలాగే పరీక్ష రాసినందున ఆ మేరకు పట్టు సాధించి ఉంటారు. అందువల్ల మొదటి ఏడాది టాపిక్స్‌తో మొదలుపెట్టాలి. చివరి వారంలో రెండో ఏడాది టాపిక్స్‌ను మరోసారి రివైజ్‌ చేసుకోవచ్చు.

  • రోజుకో మాక్‌ టెస్ట్‌ రాయాలి. ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్లను ఇందుకోసం ఉపయోగించుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున తీసుకుని రాయండి. ముఖ్యంగా 2020 తరవాతి ప్రశ్నపత్రాలను టైమ్‌ లిమిట్‌లో సాల్వ్‌ చేసుకోవాలి. అదే సమయంలో నెగెటివ్‌ మార్కులు కూడా రాకుండా చూసుకోవాలి.

  • జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ విషయానికి వస్తే - మ్యాథ్స్‌లో అడిగిన ప్రశ్నల నిడివి ఎక్కువ. కష్టంగా ఉన్నాయి. ఫిజిక్స్‌లో కాన్సెప్ట్‌ ఆధారితం, కష్టంగానూ ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రాక్టికల్‌ ఓరియెంటెడ్‌ అలాగే మోడరేట్‌గా ఉంది. కెమిస్ట్రీని తక్కువ అంచనా వేయడంతో మొదటి సెషన్‌లో ఆ సబ్జెక్టులో రాణించడంలో విద్యార్థులు విఫలమయ్యారనే చెప్పాలి.

  • వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రిపేరైతే, మొదటి స్కోర్‌ ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మెరుగుపడవచ్చు. అన్నింటికంటే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ చాలా ముఖ్యం. వ్యూహాత్మకంగా పరీక్షను ఎదుర్కొంటే సులువుగా మంచి స్కోర్‌ పొందవచ్చు.


మరికొన్ని

ఎంట్రెన్స్‌లు

  • బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో అడిగే ప్రశ్నలు ఇటు జేఈఈ మెయిన్‌కి అటు రెండు రాష్ట్రాల్లో జరిగే ఈఏపీసెట్‌కు మధ్యస్థంగా ఉంటాయి. ఈ టెస్ట్‌కు సంబంధించి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యం. అదేవిధంగా ఇంగ్లీష్‌, రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నెగెటివ్‌ మార్కులు ఈ టెస్టులో ఉన్నందున గెస్‌ వర్క్‌ పనికిరాదు.

  • ఈఏపీసెట్‌లో అడిగే 160 ప్రశ్నల్లో 80-90 సులువుగా ఉంటాయి. వీటికి కరెక్ట్‌ సమాధానాలు గుర్తిస్తే చాలు, మూడువేల లోపు ర్యాంకు సాధించవచ్చు. ఈ పరీక్ష విషయంలో క్వశ్చన్‌ పేపర్‌ అసె్‌సమెంట్‌ చేయాలి. ఇందులో కూడా మ్యాథమెటిక్స్‌లో లెంథీ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. నెగెటివ్‌ మార్కులు లేనందున ఈ పరీక్షలో గెస్‌ వర్క్‌ చేయవచ్చు.

  • విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత్‌ యూనివర్సిటీలో నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్టులు కూడా సాధారణంగా ఈఏపీసెట్‌ స్థాయిలోనే ఉంటాయి. ఈ టెస్టుల్లో మంచి ర్యాంకు సాధించగలిగితే ఫీజలు మినహాయింపు, స్కాలర్‌షిప్స్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది.

  • చివరగా ప్రవేశ పరీక్ష ఏదైనప్పటికీ సాధ్యమైనన్ని ఎక్కువ మాక్‌ టెస్టులు రాయాలి. తప్పులను తగ్గించుకోవాలి. ప్రతి తప్పు విషయంలోనూ నిష్పక్షపాతంగా జడ్జ్‌ చేసుకోవాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా దానిని బేసిక్స్‌ నుంచి మరోసారి నేర్చుకోవాలి. ఆప్పుడు విజయం దానంతట అదే మీకు చేరువ అవుతుంది.

డాక్టర్‌ పవన్‌ కుమార్‌ కాసు

ఎక్స్‌లెన్సియా, హైదరాబాద్‌

వీఐటీ ఇంజనీరింగ్‌ ఎట్రెన్స్‌ ఎగ్జామ్‌

  • ఏప్రిల్‌ 28 నుంచి మే 3 వరకు

ఎస్‌ఆర్‌ఎం జేఈఈ మూడు విడతలుగా

  • ఏప్రిల్‌ 23 నుంచి 28

  • జూన్‌ 10 నుంచి 15

  • జూలై 4, 5

నీట్‌ యూజీ: ఫ మే 3

టీజీ ఈఏపీసెట్‌

  • అగ్రికల్చర్‌, ఫార్మసీ మే 4, 5

  • ఇంజనీరింగ్‌ మే 9 నుంచి 11

ఏపీ ఈఏపీసెట్‌

అగ్రికల్చర్‌ ఫార్మసీ, ఇంజనీరింగ్‌

  • మే 12 నుంచి 20

జేఈఈ అడ్వాన్స్‌డ్‌

  • మే 17

బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌

  • మల్టీ డిసిప్లినరీ ఏప్రిల్‌ 15 నుంచి 17

  • మే 24 నుంచి 26

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 06:10 AM