Share News

తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఇస్రో యువిక

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:00 AM

స్పేస్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అందులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) అమలు...

తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఇస్రో యువిక

స్పేస్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అందులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) అమలు చేస్తున్న పథకం యువిక-2026కి నోటిఫికేషన్‌ విడుదలైంది. యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌(యువ వైజ్ఞానిక్‌ కార్యక్రమ్‌) కింద చేపడుతున్న దీనికి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని వారికి పరిచయం చేస్తారు. సబ్జెక్టు అప్లికేషన్‌ను కూడా తెలియజేస్తారు. స్టెమ్‌ - సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులపై ఆసక్తిని పెంచే విధంగా ప్రోగ్రామ్‌ని తీర్చిదిద్దారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందులో చేరేందుకు అర్హులు.

  • తొమ్మిదో తరగతిలో ఇటీవల జరిగిన పరీక్షలో సాధించిన మార్కులకు 50 శాతం, ఆన్‌లైన్‌ క్విజ్‌కు 10 శాతం వెయిటేజ్‌ ఇస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న వారికి 15 శాతం మేర అదనపు వెయిటేజ్‌ కల్పిస్తారు. సైన్స్‌ ఎగ్జిబిషన్‌ వంటి కార్యకలాపాల్లో నిర్వహించిన కృషి అలాగే స్పోర్ట్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌ఎ్‌సఎస్‌, ఒలింపియాడ్స్‌లో సాధించిన వాటికి కూడా తగు వెయిటేజ్‌ ఇచ్చి తుది ఎంపిక జరుపుతారు. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని - హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ కూడా వీటిలో ఉన్నాయి.

  • ఎంపికైన విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, భోజనం, వసతి కోసం అయ్యే ఖర్చులను ఇస్రో భరిస్తుంది. సెంటర్‌కు రాను, పోను ఏసీ రైలు టికెట్‌ వ్యయాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని కూడా చెల్లిస్తారు. ఎంపికైన వారికి మే 11 నుంచి 22 వరకు ఈ ప్రోగ్రామ్‌ ఉంటుంది. అసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: https://jigyasa.iirs.gov.in/yuvika

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 06:00 AM