Share News

ఈ సమస్య సహజమేనా

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:34 AM

శారీరక కలయిక కారణంగా శరీరంలో ఒక వైపు నొప్పి తలెత్తదు. మిగతా వేళల్లో మామూలుగానే ఉండి, కేవలం ఉదయం వేళ మాత్రమే ఈ ఇబ్బంది తలెత్తడం జరగదు. ఈ స్థితి మానసికమైనది...

ఈ సమస్య సహజమేనా

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! నా వయసు 35. నా భార్య వయసు 30. మాది అన్యోన్య దాంపత్యం. అయితే మిగతా సమయాలతో పోలిస్తే, ఉదయం వేళ శారీరకంగా కలిసిన వెంటనే నాకు చిత్రమైన అసౌకర్యం కలుగుతోంది. ఎడమ వైపు శరీరావయవాల్లో మాత్రమే నొప్పి మొదలవుతోంది. ఇందుకు కారణం ఏమై ఉంటుంది? ఇది సహజ సమస్యేనా?

- ఓ సోదరుడు, హైదరాబాద్‌

శారీరక కలయిక కారణంగా శరీరంలో ఒక వైపు నొప్పి తలెత్తదు. మిగతా వేళల్లో మామూలుగానే ఉండి, కేవలం ఉదయం వేళ మాత్రమే ఈ ఇబ్బంది తలెత్తడం జరగదు. ఈ స్థితి మానసికమైనది కావచ్చు. లేదా ఆ సమయంలో మీరు అనుసరించిన భంగిమ వల్ల శరీరం అసౌకర్యానికి గురవుతూ నొప్పి కలిగించి ఉండవచ్చు. కొన్నిసార్లు వాడుతున్న మంచం, పరుపులు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ అనుమానం తీరాలంటే ఆ సమయంలో భార్యకు కూడా శారీరక అసౌకర్యం కలుగుతుందేమో ఆరా తీయండి. ఇద్దరికీ ఇబ్బంది కలుగుతుందంటే అందుకు కారణం కచ్చితంగా మీరు అనుసరిస్తున్న భంగిమే అయి ఉంటుంది. అనుమానం తీరడం కోసం భంగిమను మార్చి చూడండి. అలాగే మంచం, పరుపు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. అయినప్పటికీ సమస్య సర్దుకోకపోతే సెక్సాలజిస్టుని సంప్రతించండి.

డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,

సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,

హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 22 , 2026 | 04:34 AM