Share News

జాబ్‌ కార్నర్‌ 1 06 2026

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:58 AM

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌...

జాబ్‌ కార్నర్‌ 1 06 2026

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ

ఖాళీలు : 90

ఇండియన్‌ ఆర్మీ- పర్మినెంట్‌ కమిషన్‌ కోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కింద అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ళు కొనసాగే సాంకేతిక శిక్షణను పూర్తి చేస్తే ఇంజనీరింగ్‌ డిగ్రీకి తోడు లెఫ్టినెంట్‌ హోదాలో ఉద్యోగం లభిస్తుంది. ఖాళీలు 90(తాత్కాలికంగా నిర్ణయించారు).

అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్‌ మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఇంటర్‌ ఉత్తీర్ణత

వయస్సు: వచ్చే ఏడాది జూలై 1 నాటికి పదహారున్నర నుంచి పందొమ్మిదిన్నర ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక: జేఈఈ మెయిన్‌ స్కోర్‌, రెండు దశల్లో పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 12

వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌

ఖాళీలు 85

నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) 85 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీకి తోడు గేట్‌(2024/ 2025/ 2026) స్కోర్‌ ఉండాలి.

ఎంపిక: గేట్‌ స్కోర్‌ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 8

వెబ్‌సైట్‌: https://www.nhidcl.com/

కోల్‌ ఇండియా లిమిటెడ్‌

ఖాళీలు 276

కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ మైనింగ్‌ విభాగంలో గేట్‌-2025 స్కోర్‌ ఆధారంగా 276 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మైనింగ్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: గేట్‌ 2025 స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ నిర్వహించి తుది ఎంపిక జరుపుతారు. దరఖాస్తుకు

చివరి తేదీ: జూన్‌ 7

మరికొన్ని విభాగాల్లో

ఇంకో నోటిఫికేషన్‌ ద్వారా 660 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేస్తోంది.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సిస్టమ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, జియాలజీ, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, రాజభాష(హిందీ), కంపెనీ సెక్రటరీ.

అర్హత: పోస్టుకు నిర్దేశించిన అర్హతలను నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 11

వెబ్‌సైట్‌: www.coalindia.in

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 05:58 AM