Share News

ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, సీఐటీడీ, బాలానగర్‌, సుప్రసిద్ధ సంస్థల్లో పీహెచ్‌డీ

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:53 AM

సైన్స్‌ విద్య వ్యాప్తి, ఇంటర్‌ డిసిప్లినరీ, పరిశోధన కోసం ఏర్పడిన అత్యున్నత సంస్థలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌) - యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో...

ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, సీఐటీడీ, బాలానగర్‌, సుప్రసిద్ధ సంస్థల్లో పీహెచ్‌డీ

ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌

సైన్స్‌ విద్య వ్యాప్తి, ఇంటర్‌ డిసిప్లినరీ, పరిశోధన కోసం ఏర్పడిన అత్యున్నత సంస్థలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌) - యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2026కి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీలోని తిరుపతి సహా దేశంలో ఇంకొన్ని చోట్ల కూడా ఇవి ఉన్నాయి.

కోర్సులు: అన్ని సెంటర్లలో అయిదేళ్ళ బీఎ్‌స-ఎమ్మెస్‌ డ్యూయల్‌ కోర్సులు ఉన్నాయి. కోల్‌కతాలో ప్రత్యేకించి కంప్యుటేషనల్‌ డైటా సైన్స్‌లో బీఎ్‌స-ఎమ్మెస్‌; భోపాల్‌లో నాలుగేళ్ళ బీటెక్‌, బీఎస్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌; తిరుపతిలో బీఎస్‌ ఎకనామిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సైన్సెస్‌ ఉన్నాయి. పూర్తిగా రెసిడెన్షియల్‌ కోర్సులు. ప్రభావపూరిత పరిశోధనకు ఈ సంస్థల్లో అవకాశం కల్పిస్తారు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మేథ్స్‌/బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. 2024, 2025, 2026తో పాసై ఉండాలి. అవే సంవత్సరాల్లో మూడేళ్ళ డిప్లొమా ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌/డిప్లొమా ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

టెస్ట్‌: జూన్‌ 7న జరుగుతుంది. మేథ్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 15 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. జవాబు కరెక్ట్‌గా గుర్తిస్తే ఒక్కోదానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. తప్పయితే ఒక మార్కు కట్‌ చేస్తారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 13. వెబ్‌సైట్‌: www.iiseradmission.in

సుప్రసిద్ధ సంస్థల్లో పీహెచ్‌డీ

సీఎ్‌సఐఆర్‌, ఐసీఎంఆర్‌, డీఎ్‌సటీకి చెందిన మొత్తం 78 ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పీహెచ్‌డీ, ఎంటెక్‌ చేసేందుకు అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ రీసెర్చ్‌ - ఆగస్టు సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఏఆర్‌ఎ్‌ఫబీఆర్‌, ఎన్‌ఐఎన్‌ కూడా ఈ సంస్థల్లోనే కలిసి ఉన్నాయి.

కోర్సులు: పీహెచ్‌డీ(సైన్స్‌, మెడికల్‌ రీసెర్చ్‌, ఇంజనీరింగ్‌), ఎంటెక్‌ + పీహెచ్‌డీ, ఎంటెక్‌

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 14 (మరిన్ని వివరాలకు బ్రోచర్‌ చూడవచ్చు.)

వెబ్‌సైట్‌: www.acsir.res.in/admissions

సీఐటీడీ, బాలానగర్‌

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న ఎంఎ్‌సఎంఈ టూల్‌ రూమ్‌ - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కోర్సులు: టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ - ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉన్నాయి.

అర్హత: టెన్త్‌ పాసై ఉండాలి.

ఎంపిక: ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా. టెస్ట్‌ మే 24న నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 22

వెబ్‌సైట్‌: www.citd.in link - Diploma

Admissions - 2026

ఈ వార్తలూ చదవండి:

బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్

కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..

Updated Date - Mar 09 , 2026 | 05:53 AM